Don't Miss!
- Lifestyle
చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టే PCOD మరియు PCOS సమస్యకు ఈ ఆహారాలు పరిష్కారం చూపుతాయి.
- News
వైసీపీకి మద్దతిచ్చిన బీఆర్ఎస్ - పార్లమెంటులో ఆసక్తికర పరిణామం-ఇదే తొలిసారి ?
- Finance
adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Pogaru 3 days collections: తెలుగు సినిమాలతో కన్నడ హీరో పోరాటం.. ఇంకా ఎంత రావాలంటే?
సంక్రాంతి అనంతరం బాక్సాఫీస్ జోరు మరింత పెరిగింది. తెలుగు ఆడియెన్స్ సినిమాల కోసం ఏ రేంజ్ లో ఎదురుచూశారో ఇటీవల వచ్చిన ఉప్పెనతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక కంటెంట్ బావుంటే కరోనా వచ్చినా కలెక్షన్స్ తగ్గవని కూడా ఋజువయ్యింది. అయితే తెలుగులో మొదటిసారి కన్నడ హీరో ధృవ సర్జా కూడా పొగరు సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాను భారిగానే రిలీజ్ చేశారు.
మలయాళీ ముద్దుగమ్మగా సన్నీలియోన్.. కేరళ కుట్టిగా అందంతో ఆకట్టుకొంటూ

పొగరు కోసం మూడేళ్ళ కష్టం..
సీనియర్ స్టార్ హీరో అర్జున్ సర్జా మేనల్లుడైన ధృవ కన్నడలో ఇప్పుడిప్పుడే తన క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. కన్నడలో అతను తీసింది కేవలం మూడు సినిమాలే. ఆ సినిమాలు మూడు కూడా కన్నడ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగానే అందుకున్నాయి. ఇక ఆ సినిమాలకంటే హై రేంజ్ లో ఉండాలని పొగరు సినిమా కోసం ధృవ మూడేళ్లు కష్టపడ్డాడు.

డీసెంట్ ఓపెనింగ్స్..
అసలైతే సినిమాను గత ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. సినిమాలోని కరాబు అనే సాంగ్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. తెలుగులో కూడా ఆ సాంగ్ గట్టిగానే క్లిక్కయ్యింది. ఇక సినిమా గత శుక్రవారం రిలీజయ్యి డీసెంట్ ఓపెనింగ్స్ ను అందుకుంది.

3వ రోజు వచ్చిన కలెక్షన్స్..
సినిమా హైప్ అయితే బాగానే క్రియేట్ చేసుకుంది గాని రిలీజ్ అనంతరం పెద్దగా పాజిటివ్ టాక్ ను మాత్రం అందుకోలేకపోయింది. మూడవ రోజు ఎపి తెలంగాణలో వచ్చిన కలెక్షన్స్ (షేర్స్)ఈ విధంగా ఉన్నాయి.. నైజాం 14లక్షలు, సీడెడ్ 10లక్షలు, ఉత్తరాంధ్ర 6లక్షలు, ఈస్ట్ 4లక్షలు, వెస్ట్ 2.3లక్షలు, గుంటూరు 3.1లక్షలు, కృష్ణా 3.3లక్షలు, నెల్లూరు 2లక్షలు.

ఇంకా ఎంత రావాలి అంటే..
మొత్తంగా ముడవరోజు ఎపి తెలంగాణలో పొగరు సినిమాకు 44లక్షల షేర్స్ వచ్చాయి. ఇక మూడు రోజుల మొత్తం షేర్స్ 1.71కోట్లు. యాక్షన్ సీన్స్ కోసం మాస్ ఆడియెన్స్ ఎట్రాక్ట్ అవ్వడం వలన ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక సినిమా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో చేసిన బిజినెస్ 3.7కోట్లు. 4కోట షేర్స్ అందుకుంటేనే హిట్టయినట్లు లెక్క. ప్రాఫిట్ జోన్ లోకి రావాలి అంటే మరో 2.29కోట్లు రాబట్టాల్సిందే.