»   » రామ్ తో పాటే బాలయ్య వస్తున్నాడు

రామ్ తో పాటే బాలయ్య వస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'ఆన్ టైంలో వస్తా అనుకున్నది చేస్తా' అంటూ హడవిడి చేయాబోతున్న బాలయ్య మరో హంగామా కి రెడీ అవుతున్నాడు. జనవరి 1తేదిన రామ్ నేను శైలజతో పాటుగా డిక్టేటర్ దియోటర్ ట్రైలర్ కూడా విడుదల చేయాడానికి సిద్దపడుతున్నారు.

దీని తర్వాత జనవరి 4న డిక్టేటర్ ఫ్లాటినమ్ డిస్క వేడుకను నిర్వహించనున్నారు. ఈ సినిమా ఆడియోని అమరావతిలో విడుదల చేయాగా, ఇప్పుడీ ఫంక్షన్ ని హైదరాబాద్ లోని శిల్పకాళావేదిక పై చేయాడానికి రెడీ అవుతున్నారు.

ఆడియోకి మంచి స్పందన వచ్చిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేయ్యబోతున్నారు. దీనికి సంబందించిన పనులు చాలా వేగంగా సాగుతున్నాయి.

 ‘Dictator’ Theatrical trailer releasing along with ‘Nenu Sailaja'

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంన్ని ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

నందమూరి అభిమానులు బాలయ్యబాబును ఎలా చూడాలనుకుంటున్నారో అలా, ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఫుల్ ఎంటర్ టైనింగ్ తో స్టయిలిష్ గా సినిమా రూపొందుతోంది.

ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
Theatrical trailer of Balakrishna's ‘Dictator’ movie is releasing along with ‘Nenu Sailaja' prints which is releasing on January, 1st as New Year Special.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu