»   » నైజాం ..దిల్ రాజు చేతికి, యూనిట్ ఫుల్ హ్యాపీ

నైజాం ..దిల్ రాజు చేతికి, యూనిట్ ఫుల్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దిల్ రాజు ఓ చిత్రం రైట్స్ తీసుకున్నాడంటే ఆ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేస్తుంది. తాజాగా ఆయన శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ‘ఎక్సప్రెస్ రాజా' చిత్రం నైజాం రైట్స్ తీసుకున్నారు. రీసెంట్ గా ఆయన ఈ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ చూసి వెంటనే రైట్స్ ని తీసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నట్లు సమచారం. దాంతో సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రం యూనిట్ చాలా ఆనందంగా ఉన్నారు. దాంతో స్పెషల్ టీజర్ వదలి, న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చి మరీ ప్రమోషన్స్ మొదలెట్టారు.

శర్వానంద్‌ , సురభి హీరోహీరోయిన్స్ గా మేర్లపాక గాంధీ డైరక్టర్ గా రూపొందిన సినిమా ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా'. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మంచన ఈ సినిమాకి ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో విడుదలయ్యాయి. తొలి సీడీని ప్రముఖ హీరో ప్రభాస్‌ దిల్‌రాజు కు అందించారు.

శర్వానంద్‌ చెబుతూ ....‘‘ఈ సినిమాలో ప్రతి పాత్రా కీలకమే. వినోదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. యూవీ క్రియేషన్స్‌ నా సొంత సంస్థ లాంటిది. మేమంతా కలసి చేసిన ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది''అన్నారు.

Dil Raju bagged Express Raja Nizam rights

‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' లాంటి మంచి సినిమా అందించాడు గాంధీ. ఈ చిత్రమూ అతనికి విజయాన్ని అందిస్తుంది''అని ఆకాంక్షించారు దిల్‌రాజు.

దర్సకుడు మాట్లాడుతూ...‘‘శర్వానంద్‌తో సినిమా అంటే బెంజ్‌ కారులో ప్రయాణం చేయడమే. అంత హాయిగా ఉంటుంది. ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడు ఈ సినిమాని ప్రేమించి పనిచేశారు.. అందుకే ఓ మంచి సినిమాని అందివ్వగలుగుతున్నామ''అన్నారు దర్శకుడు.

‘‘ఏ సినిమా విజయవంతమవ్వాలన్నా కథే కీలకం. దర్శకుడిలో స్పష్టత అవసరం. మేర్లపాక గాంధీ ఓ మంచి కథతో వచ్చారు. పాటలన్నీ విన్నాను. ‘కలర్‌ఫుల్‌ చిలక'పాట నాకు బాగా నచ్చింది'' అని ప్రభాస్ అన్నారు.

ర్వానంద్‌, సురభి, ఊర్వ హరీష్‌ ఉత్తమన్‌, పోసాని కృష్ణ మురళి, సూర్య, నాగినీడు బ్రహ్మాజి, సుప్రీత్‌, సప్తగిరి, ప్రభాస్‌ను, షకలకశంకర్‌, ధనరాజ్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ - ప్రవీణ్‌ లక్కరాజు, సినిమాటోగ్రఫి - కార్తిక్‌ గట్టమనేని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ - సందీప్‌.ఎన్‌, ఎడిటర్‌- సత్య.జి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ - ఎస్‌.రవిందర్‌, లిరిక్స్‌ - భాస్కరభట్ల, శ్రీమణి, శ్రీ జో, డ్యాన్స్‌ - రాజు సుందరం, విశ్వ, రఘు, చీఫ్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ - తోట ఫైట్స్‌ - స్టంట్‌ జాషువా,ప్రొడక్షన్‌ కంట్రోలర్స్‌- ఎమ్‌.కష్ణం రాజు (గోపి), మత్తపాటి షణ్ముఖ రావ్‌, పి.ఆర్‌.ఒ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను, పబ్లిసిటి డిజైనర్‌ - వర్కింగ్‌ టైటిల్‌ (శివకిరణ్‌). స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, డైరెక్షన్‌ -మేర్లపాక గాంధి

English summary
Dil Raju has bagged the Nizam Rights of Sharwanand's ‘Express Raja’ .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu