»   » అల్లు అర్జున్ పై నమ్మకం..అందుకే దిల్ రాజు అంత రేటుకి

అల్లు అర్జున్ పై నమ్మకం..అందుకే దిల్ రాజు అంత రేటుకి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ' సన్నాఫ్‌ సత్యమూర్తి'.సమంత, నిత్యమేనన్‌, అదాశర్మ , రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హోటల్‌ నోవాటెల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడే ఈ చిత్రం బిజినెస్ ఊపందుకుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం దిల్ రాజు..ఈ చిత్రం నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ హక్కులను 13కోట్లకు పైనే చెల్లించి సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇప్పటికే విడుదలైన ఆడియోకి కూడా అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ట్రైలర్‌లో అల్లు అర్జున్ స్టైల్, త్రివిక్రమ్ మార్క్ మరియు సినిమా ఫ్యామిలీలను టార్గెట్ చేసారని తెలుస్తూండటంతో ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

Dil Raju bags S/o Satyamurthy distribution rights

ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న కానీ, అల్లు అర్జున్ పుట్టిన రోజైన 8న కానీ విడుదలయ్యే అవకాసం ఉంది. అల్లు అర్జున్ సరసన సమంతా, అదా శర్మ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు.

సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
Dil Raju has bagged the distribution rights of Allu Arjun's 'S/O Satyamurthy' Nizam area.
Please Wait while comments are loading...