»   » నాగ్, మహేష్ ల మీద దిల్ రాజు బెట్టింగ్

నాగ్, మహేష్ ల మీద దిల్ రాజు బెట్టింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బెట్టింగ్ అంటే మీరు వేరే ఊహించుకోకండి..సినిమాలు ఎక్కువ రేటు పెట్టి కొనటం ట్రేడ్ సర్కిల్స్ లో బెట్టింగ్ లాంటిదే అంటూంటారు. ఇప్పుడు దిల్ రాజు ఈ మధ్యనే హిట్ కొట్టిన నాగార్జున తాజా చిత్రం ఊపిరి, మహేష్ బాబు ..బ్రహ్మోత్సవంల మీద కన్నేసారు.

ఈ రెండు చిత్రాలు నైజాం రైట్స్ దిల్ రాజు తీసుకున్నట్లు సమాచారం. సోగ్గాడే చిన్ని నాయినా సూపర్ హిట్ అవటంతో నాగార్జున సినిమాకు వీర క్రేజ్ ఏర్పడింది. అలాగే ఈ రెండు సినిమాలు పి.వీ.పి బ్యానర్ వారివే కావటం విశేషం.

Dil Raju buys Oopiri & Brahmotsavam

దీన్ని బట్టి అర్దమవుతోంది ఏమటీ అంటే..సమ్మర్ లో డిస్ట్రిబ్యూటర్ గా పూర్తి స్దాయి బిజీగా ఉండేది దిల్ రాజు అని. దిల్ రాజు ఫైనల్ చేసి చిత్రం రైట్స్ తీసుకున్నాడంటే ఎంత రేటైనా ఇచ్చి ఆ సినిమాలను తీసుకోవటానికి మిగతా డిస్ట్రిబ్యూటర్స్ క్యూ కడుతూంటారనేది తెలిసిన విషయమే.

దిల్ రాజు కూడా ప్రొడక్షన్ మీద కన్న మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఎక్కువ కాన్సర్టేషన్ పెడుతున్నారు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ లో కూడా పెద్ద పెద్ద మొత్తాలు వెచ్చించాల్సి రావటంతో అదీ నిర్మాణంలాగే మారిందంటన్నారు. మరి ఈ రెండు చిత్రాలు ఏ రేంజి లాభాలు దిల్ రాజు కు తీసుకు వస్తాయో చూడాలి.

English summary
Dil Raju has brought the rights of Nizam areas for the film Brahmotsavam and Nagarjuna-Karthi starrer Oopiri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu