»   »  నచ్చి, సమర్పిస్తూ దిల్ రాజు స్వయంగా రిలీజ్

నచ్చి, సమర్పిస్తూ దిల్ రాజు స్వయంగా రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dil Raju
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, మరియు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఓ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారంటే ఆ క్రేజే వేరు. తాజాగా ఆయన నారారోహిత్ 'ప్రతినిధి' చిత్రం చూసి స్టేట్ మొత్తం తనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అలాగే చిత్రానికి ఆయనే సమర్పకుడుగా వ్యవహించనున్నాడని తెలుస్తోంది. త్వరలో విడుదల కు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఉంది.

వర్తమాన రాజకీయాల్ని ప్రశ్నించే ప్రజా 'ప్రతినిధి'గా నారా రోహిత్ ప్రేక్షకులముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి జె.సాంబశివరావు నిర్మాత. ఈ చిత్రం ఓ కిడ్నాప్ కథ చుట్టూ జరగనుంది. మొన్న ఆడియో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది.

నారా రోహిత్ మాట్లాడుతూ..ఈరోజుల్లో రూపాయికే విలువ లేదు. ఇక పైసల్ని పట్టించుకొనేదెవరు? కానీ అతను అలా కాదు. ప్రతి పైసాకీ సమాధానం చెప్పాల్సిందే. ఎనభై నాలుగు పైసల కోసం ఏకంగా.. ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేశాడు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన కాళ్ల దగ్గరకు రప్పించాడు. ఇంతకీ అతనెవరు? ఆ తరవాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''సమకాలీన సమస్యలపై ఓ సామాన్యుడు సాగించిన సమరం ఇది. ప్రతినిధిగా నారా రోహిత్‌ నటన, ఆయన పలికే సంభాషణలు అందరికీ నచ్చుతాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రచార చిత్రం కూడా ఆకట్టుకొంటోంద''న్నారు. ''ప్రస్తుత రాజకీయాలు సగటు మనిషి జీవితాన్ని ఎలా మారుస్తున్నాయో ఈ చిత్రంద్వారా చూపిస్తున్నాం''అని నిర్మాత చెప్పారు.

ఇక '18 సంవత్సరాల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకుంటే జీవితం పాడైపోతుందని అందరూ అంటారు. అదే 18 సంవత్సరాల వయసులో ఓటేస్తే ప్రభుత్వం పాడైపోతుందని ఎవరూ అడగరే...వస్తున్నా...అడగడానికే వస్తున్నా..' అని నారా రోహిత్ ట్రైలర్స్ లో అంటున్నారు. సమకాలీన రాజకీయాంశాల్ని చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోందని, ప్రజా శ్రేయస్సును కాంక్షించే సిసలైన ప్రజా ప్రతినిధి ఎలా వుండాలో సినిమాలో చూపిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి . సంగీతం: సాయికార్తీక్‌.

English summary
Dil Raju is now going to act as the presenter for Nara Rohith’s ‘Prathinidhi’ film. Nara Rohith will be seen as an angry young man who kidnaps the Chief Minister of Andhra Pradesh, for a cause.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu