For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దిల్ రాజుకు గట్టిగానే ‘రెబల్’దెబ్బ?

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రబాస్ తాజా చిత్రం 'రెబల్'. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే టాక్ ఎలా ఉన్నా అభిమానులతోనూ, వీకెండ్ లో చూసే వారితోనూ, మొదటే రిజర్వ్ చేసుకున్న వారితోనూ మొదటి మూడు రోజులు కలెక్షన్స్ సాధారణంగా ఫిల్ అవుతూంటాయి. అయితే 'రెబల్'కి నైజాం ఏరియాలో ఆ అదృష్టం లేదంటున్నారు. 29(శనివారం) గణేష్ నిమజ్జనం రావటం,30(ఆదివారం)తెలంగాణా మార్చ్ రావటంతో ధియోటర్స్ వెలా తెలా పోయాయి. ముఖ్యంగా 30 న ధియోటర్స్ క్లోజ్ చేసేసారు. అలాగే సోమవారం(అంటే ఈరోజు)తెలంగాణా బంద్ ఎఫెక్టు కూడా పడనుంది. దాంతో నైజాం తీసుకున్న దిల్ రాజుకు పూర్తి లాస్ రావటం ఖాయం అంటున్నారు.

  అయితే ట్రిమ్ చేసిన వెర్షన్ తో రాబోయే రోజుల్లో ఏమన్నా కలెక్షన్స్ పికప్ అవుతాయేమోననే ఆశ మాత్రం ఉందని ట్రేడ్ లో వ్యాఖ్యానిస్తున్నారు. భారీ రేట్లకు కొన్న 'రెబల్'డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బులు వెనక్కి తిరిగి వస్తాయా,రావా అనే డైలామోలో పడినట్లు చెప్పుకుంటున్నారు. కొంతలో కొంత ఓపినింగ్స్ బాగుండటం ఈ సినిమాు కలిసి వచ్చిన అంశం. అయితే ప్రభాస్ మాత్రం ఈ చిత్రం విజయంపై ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు.

  ప్రబాస్ టాక్ విషయమై మాట్లాడుతూ... ''సినిమా ఫలితాన్ని మొదటి రోజే తేల్చిచెప్పేయడం కష్టం. లెక్కలు తేలాలంటే కనీసం వారం రోజులైనా పడుతుంది. సినిమా ఫలితాన్ని ఎవరైనా ముందే చెప్పేస్తే.. కోటి రూపాయలిస్తా. నా సినిమా ఎలా ఉందో ఇంట్లోవాళ్లు చెప్పేస్తారు. రెబల్‌ సినిమా థియేటర్లో అభిమానుల మధ్య కూర్చుని చూశా. వారి స్పందన కళ్లారా గమనించాను. విశ్రాంతి ముందొచ్చే పోరాట సన్నివేశాలు వారికి బాగా నచ్చాయి. అసలు అలాంటి ఆలోచన రావడం గొప్ప విషయం. దాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు లారెన్స్‌ చూపించగలిగాడు. అతను సినిమాల్ని చాలా స్త్టెలిష్‌గా తీస్తాడు. పెదనాన్నగారి పాత్ర మలిచిన తీరే అందుకు నిదర్శనం'' అని చెప్పుకొచ్చారు.

  అలాగే యాక్షన్‌ ఘట్టాల కోసం చాలా కష్టపడ్డాం. వాటికోసం చాలా రోజులు కేటాయించాం. అందుకే ఆలస్యమైంది. ఈ సినిమాలో బ్రహ్మానందం చేతిలో దెబ్బలు తిన్నాను. చివర్లో... లేడీ ఫైటర్లతో ఓ పోరాట సన్నివేశం ఉంటుంది. కానీ... ఇవన్నీ కొత్త ఆలోచనల్లో భాగాలే అనుకోవాలి. ప్రతిసారీ... ఒకేలా చేస్తే 'ఏంటిది? రొటీన్‌గానే ఉందే' అంటారు. అందుకే ఓ ప్రయత్నం చేశాం. అభిమానులు అర్థం చేసుకొంటారనే నమ్మకం ఉంది అన్నారు.

  English summary
  ‘Immersion of Ganesha’ happened on 29th September and Prabhas’s ‘rebel’ got poor collections in Nizam and other areas of the state. On the other hand, ‘Telangana March’ in Hyderabad resulted in closure of theaters in Hyderabad on Sunday. All these factors worked against ‘rebel’s collections. The movie will have to get steady collections to be termed as safe at the box office and let’s wish the movie will achieve its task.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X