For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే 25... అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా.. ట్రెండ్ సెట్టర్

  |

  దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే.. ఈ ఒక్క సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని మరో లెవెల్ కి తీసుకువెళ్లిందనే చెప్పాలి. అప్పటివరకు ఉన్న సినిమాల రొటీన్ ఫార్ములాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాయని ఒక పిచ్చి నమ్మకం ఉండేది. కానీ ఆ ఫార్ములాను బ్రేక్ చేసి విమర్శకుల కళ్ళు తిరిగేలా ఒక పరొమాంటిక్ ప్రేమ కథతో కూడా రికార్డులను క్రియేట్ చేయవచ్చని దర్శకుడు ఆదిత్య చోప్రా, నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ చేసిన సింపుల్ ప్రయోగం సక్సెస్ అయ్యింది.

  ఎన్నిసార్లు చూసినా కూడా అదే ఫీల్..

  ఎన్నిసార్లు చూసినా కూడా అదే ఫీల్..

  1995 అక్టోబర్ 20న విడుదలైన ఈ సినిమా వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది. షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టొరీ వచ్చి అప్పుడే పాతికెళ్లవుతోంది అంటే ఎవరు నమ్మలేకపొతున్నారు. ఎందుకంటే సినిమా ఎప్పుడు చూసినా, ఎన్నిసార్లు చూసినా కూడా ఫ్రెష్ గా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. రాజ్, సిమ్రాన్ పాత్రలు అయితే జనాల గుండెల్లో అలానే ఉండిపోయాయి.

  వెయ్యిరోజులు ఆడిన సినిమా

  వెయ్యిరోజులు ఆడిన సినిమా

  ఇక ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆదిత్య చోప్రా మేకింగ్ స్టైల్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఒక ఫీల్ ని కలిగించిన విధానం మళ్ళీ మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చేలా చేసింది. ఇక జతిన్ - లలిత్ అందించిన సంగీతం ఆల్ టైమ్ బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచింది. 1995 తరువాత 5 ఏళ్ల పాటు ఎక్కడ విన్నా అవే పాటలు. మహారాష్ట్రలో ఒక థియేటర్ లో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే 1009రోజులు ఆడింది అంటే సినిమా ప్రభావం ఎలా ఉండేదో చెప్పవచ్చు.

  సౌత్ లో కూడా న్యూ రికార్డ్స్..

  సౌత్ లో కూడా న్యూ రికార్డ్స్..

  సినిమాలోని లవ్ ఎమోషన్స్ కి తోడు పాటలు తెచ్చిన ప్రమోషన్స్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ అనే చెప్పాలి. మెయిన్ గా "తుజే దేఖా తో" పాట గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగు తమిళ్ ఆడియెన్స్ కూడా భాషతో సంబంధం లేకుండా కొన్నేళ్ల వరకు గ్యాప్ లేకుండా విన్నారు. అంతేకాకుండా సౌత్ లో కూడా సినిమా కలెక్షన్స్ గట్టిగానే రాబట్టింది. మెహందీ లగా కే రఖ్నా అనే పాట కూడా ఒక వండర్ అనే చెప్పాలి. మొత్తంగా దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే.. పాటలతో పాటు సినిమా కంటెంట్ కూడా బాగా కనెక్ట్ అయ్యింది.

  బాక్సాఫీస్ కలెక్షన్స్..

  బాక్సాఫీస్ కలెక్షన్స్..

  హిందీలో రూపొందినప్పటికీ దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ దక్కించుకున్న దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే బాక్సాఫీస్ కలెక్షన్స్ లో మాత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా 20కోట్లు కలెక్ట్ చేస్తేనే అందరూ షాక్ అయ్యారు. కానీ భారత్‌లో మొత్తంగా రూ.89 కోట్లు వసూలు చేసింది. ఇక విదేశాల లెక్కలు చూసుకుంటే రూ.13.50 కోట్లు రాబట్టిందట. మొత్తంగా 100కోట్లు సాధించిన మొదటి సినిమా అదేనని చెప్పవచ్చు. ఇక ఆ లెక్కలను ఇప్పటి లెక్కలతో పోలిస్తే 500కోట్లని చెప్పవచ్చు.

  English summary
  Dilwale Dulhania Lejayenge .. This one film has taken the level of Bollywood industry to another level. Until then there was an insane belief that only the routine formulas of existing movies would receive record-breaking collections at the box office. But director Aditya Chopra's simple experiment with production company Yash Raj Films has succeeded in breaking that formula and creating records with a romantic love story that can catch the eyes of critics.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X