»   » బాహుబలి2 కలెక్షన్లు మైండ్ బ్లోయింగ్.. కోట్ల కుంభవర్షం.. వివరాలు ఇవిగో..

బాహుబలి2 కలెక్షన్లు మైండ్ బ్లోయింగ్.. కోట్ల కుంభవర్షం.. వివరాలు ఇవిగో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కనక వర్షం కురిపిస్తున్నట్టు వార్తలు పోటెత్తుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం బాహబులి2 చేసిన వసూళ్లతో పలు పరిశ్రమ వర్గాల మైండ్ బ్లాంక్ అవుతున్నది. సినీ పరిశ్రమ వాణిజ్యంలో ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి'గా అవతరించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లపై సినీ విమర్శకులు ఉమర్ సంధూ, ట్రేడ్ అనలిస్టులు తరుణ్ ఆదర్శ్, రమేశ్ బాలా, సినీ ప్రముఖలు కరణ్ జోహర్ లాంటి లెక్కలు కట్టడంలో బిజీగా ఉన్నారు.

రూ.125 కోట్లు

రూ.125 కోట్లు

ఉమర్ సంధూ ట్వీట్ చేసిన ప్రకారం తొలిరోజు బాహుబలి2 సినిమా దేశవ్యాప్తంగా రూ.125 కోట్లు వసూలు చేసింది. ఇది భారతీయ సినిమా పరిశ్రమ చరిత్రలో ఇదో అరుదైన రికార్డు. ఇప్పటివరకు ఏ బాలీవుడ్ సూపర్‌స్టార్ నటించిన సినిమాకు కూడా ఇంత మొత్తంలో కలెక్షన్లు రాకపోవడం గమనార్హం.


దేశవ్యాప్తంగా కలెక్షన్లు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రూ.55 కోట్లు
హిందీ రూ.38 కోట్లు
కర్ణాటక రూ.12 కోట్లు
కేరళ రూ.9 కోట్లు
తమిళనాడు 11 కోట్లు
ఆల్ ఇండియా వైడ్ రూ.125 కోట్లు


ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లు

బాహుబలి2 కలెక్షన్లు మైండ్ బ్లోయింగ్. తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.230 కోట్లు సాధించింది. ఇది ఓ రికార్డు. ఓ చరిత్ర. ఇండియా, అమెరికా, మలేషియా, యూఏఈలో రికార్డులు బద్దలు అవుతున్నాయి అంటూ ఉమర్ సంధూ మరో ట్వీట్ చేసింది.


రికార్డులు కనుమరుగు..

ఇప్పటికే ఇండియాలో బాక్సాఫీస్‌కు సంబంధించిన అన్ని రికార్డులు కనుమరుగైపోయాయి. బాహుబలి2 హిస్టారిక్ గా రూ.125 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇక పండుగ మొదలైంది అంటూ ఉమర్ సంధూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.


English summary
Director Rajamouli's prestigious venture Baahubali2 created a History. Worldwide Its collected Rs.230 crores. In India Baahubali collected Rs. 125 crores nett. As per reports, Baahubali released in over 9000 screens worldwide. Smashing all records India, and worldwide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu