Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డిస్కోరాజా హంగామా.. అల్లు అర్జున్, మహేష్‌లతో పోటీ.. రెండో రోజు ఎంత రాబట్టిందంటే!
మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా డిస్కోరాజా. జనవరి 24వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలి షో తోనే మిశ్రమ స్పందన తెచ్చుకొని చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబడుతోంది. ఓ ఏరియాలో అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలతో పోటీపడి దాదాపుగా ఆ రేంజ్ వసూళ్లు రాబట్టింది. ఆ వివరాలు చూద్దామా..

అన్ని ఏరియాల్లో గిరాకీ.. అవేవీ అడ్డంకి కాదు
రవితేజ ఎనర్జీ, యాక్టింగ్ స్టైల్, యాటిట్యూడ్ ఇలా ప్రతీది రవితేజ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉండటంతో ఈ సినిమా హంగామా నడుస్తోంది. ఈ మేరకు అన్ని ఏరియాల్లో సినిమాకు మాంచి గిరాకీ ఉంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా డిస్కోరాజాకు మాత్రం అవేవీ అడ్డంకిగా మారలేదని తెలుస్తోంది. తొలి రోజే ఈ సినిమా 3.5 కోట్ల రేంజ్ షేర్ రాబట్టినట్లు రిపోర్ట్స్ వచ్చాయి.

సంక్రాంతి పోటీ.. లేటుగా రంగంలోకి రవితేజ
ఇక ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ''అల.. వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు'' ఓ రేంజ్‌లో పోటీపడిన సంగతి తెలిసిందే. జనవరి 11, 12 తేదీల్లో విడుదలైన ఈ రెండు సినిమాలు సక్సెస్ కావడంతో నేటికీ ఆ సినిమాల హంగామా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రిలీజైన రవితేజ డిస్కోరాజా మూవీ వాటికి గట్టిపోటీ ఇస్తుండటం విశేషం.

ఆ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందంటే
తెలుగు రాష్ట్రాల్లో మంచి జోష్ కనబరుస్తున్న రవితేజ.. ఉత్తరాంధ్ర ఏరియాలో రెండో రోజు (శనివారం) కూడా కుమ్మేశాడు. 22 లక్షల షేర్ రాబట్టి మహేష్, అల్లు అర్జున్ సినిమాల సరసన నిలిచాడు. ఇదే రోజు అల.. వైకుంఠపురములో సినిమాకు ఉత్తరాంద్రలో 35 లక్షల షేర్, అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమాకు 24.6 లక్షల షేర్ వచ్చింది.

ఓవర్సీస్‌లో డిస్కోరాజా సత్తా
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఇతర రాష్ట్రాల్లో కూడా డిస్కోరాజా సత్తా చాటుతోంది. ఓవర్సీస్‌లోనూ మంచి ఓపెనింగ్స్ అందుకున్న డిస్కోరాజా.. రెండో రోజు కూడా అదే జోష్ కొనసాగించినట్లు రిపోర్ట్స్ అందాయి.

డిస్కోరాజా మూవీ
భారీ అంచనాల నడుమ విడుదలైన డిస్కోరాజా మూవీలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా జోరుమీదుంది.