Just In
Don't Miss!
- News
'ఆస్కార్'ను మించిన డ్రామా... అసలు నిజాలివి.. విద్యార్థులతో షర్మిల ముఖాముఖిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
- Sports
India vs England: పూణేలోనే వన్డే సిరీస్.. ప్రేక్షకులకు మాత్రం నో ఎంట్రీ!!
- Lifestyle
లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఈ ఘోరమైన క్యాన్సర్ గురించి మీకు తెలుసా?
- Finance
2025 నాటికి సింగపూర్ ఆర్థికవ్యవస్థకు 12 లక్షల మంది సాంకేతిక నైపుణ్యం ఉన్న ఉద్యోగులు అవసరం
- Automobiles
మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడు బెంగళూరులో
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దుమ్ములేపిన డిస్కోరాజా.. మొదటి రోజు ఎంత రాబట్టాడంటే..?
మాస్ మహారాజా రవితేజ, విలక్షణ దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో వచ్చిన డిస్కోరాజా శుక్రవారం (జనవరి 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ ఎనర్జీ, యాక్టింగ్ స్టైల్, యాటిట్యూడ్ ఇలా ప్రతీది రవితేజ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉండటంతో సినిమా పాసయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లను ఓ సారి చూద్దాం..

సంక్రాంతి సీజన్ ముగిసినా..
సంక్రాంతి సీజన్ ముగిసినా.. బరిలో ఇంకా రెండు పెద్ద చిత్రాలు ఉన్నాయి. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. ఇలా ఈ రెండు చిత్రాలు ఇంకా థియేటర్లలోనే ఉన్నా.. డిస్కోరాజాకు మాత్రం మంచి వసూళ్లే వచ్చినట్టు తెలుస్తున్నాయి.

డిస్కోరాజా వసూళ్లు..
మిక్స్‌డ్ టాక్ వచ్చినా డిస్కోరాజాకు మాత్రం అవేవీ అడ్డంకిగా మారలేదని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో 3.2 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆఫ్ లైన్ టిక్కెట్ల లెక్కలను కూడా జోడస్తే.. మొత్తం మీద 3.8 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఓవర్సీస్‌లో వసూళ్లు
ఇక ఏపీ, తెలంగాణేతర రాష్ట్రాల్లో కూడా డిస్కోరాజా సత్తా చాటుతోంది. ఓవర్సీస్‌లోనూ మంచి ఓపెనింగ్స్ అందుకున్న డిస్కోరాజా.. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 4.2 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.

డిస్కోరాజా ప్రీ రిలీజ్ బిజినెస్
సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి..
నైజాంలో రూ.5.7 కోట్లు
సీడెడ్‌లో రూ.2.75 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.1.95 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ. 1.25కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.05కోట్లు
గుంటూరులో రూ.1.5 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.1.25 కోట్లు
నెల్లూరులో రూ.0.65కోట్లు
కర్ణాటకలో రూ.1.1కోట్లు
మిగితా రాష్ట్రాల్లో రూ.0.5 కోట్లు
ఓవర్సీస్‌లో రూ.1.5కోట్లుతో మొత్తంగా రూ.19.20 కోట్లకుపైగా బిజినెస్ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ హిట్ కావడానికి కావాల్సిన రూ.20కోట్లను కలెక్ట్ చేస్తే నిర్మాతలు గట్టెక్కినట్టే.

ఏరియా వారిగా చూస్తే..
డిస్కోరాజా మొదటి రోజు బాగానే రాబట్టగా ఏ ఏ ఏరియాలో ఎంత రాబట్టాడో ఓసారి చూద్దాం. నైజాంలో 1.08కోట్లు, సీడెడ్‌లో 36లక్షలు, ఉత్తరాంధ్రలో 31లక్షలు, ఈస్ట్ 19లక్షలు, వెస్ట్ 15లక్షలు, గుంటూరు 17లక్షలు, కృష్ణా 18లక్షలు, నెల్లూరు 10లక్షలు ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2.54కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.