»   » షాక్ :రజనీకాంత్ సినిమాకు బిజినెస్ సమస్య

షాక్ :రజనీకాంత్ సినిమాకు బిజినెస్ సమస్య

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : రజనీకాంత్ హీరోగా నటించిన 'విక్రమసింహ' ఏప్రియల్ 11న విడుదల చేసేందుకు దర్శక,నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూ రిలీజ్ తేది ని ప్రకటించారు. అయితే చిత్రం బిజినెస్ అనుకున్నంతగా జరగలేదని చెన్నై సిని వర్గాల సమస్య. సినిమా ఫస్ట్ టీజర్ విడుదల అయ్యాక క్రేజ్ మొత్తం పోయిందని, అంతా దీన్నో కార్టూన్ సినిమాగా భావిస్తున్నారని, డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహంగా ఈ చిత్రం రిలీజ్ చేయటానికి ముందుకు రావటం లేదని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే దర్శకురాలు సౌందర్య ఈ చిత్రం కార్టూన్ చిత్రం కాదని యానిమేటెడ్ చిత్రం అని వివరించి,అవగాహన పెంచే ప్రయత్నం చేసారు.

  పెర్‌ఫార్మన్స్‌ మోషన్‌ క్యాప్చరింగ్‌ విధానంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీ సరసన దీపికా పదుకొణే నటించింది. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. సునీల్‌ లుల్ల నిర్మాత. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరచిన పాటల్ని రీసెంట్ గా విడుదలయ్యాయి. 'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల చేశారు.

  Distributers Problem for Kochadaiiyaan?

  రజనీకాంత్ నటించిన చివరి చిత్రం 'రోబో' 2010లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. 'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

  English summary
  Super Star Rajinikanth's Upcoming Animated Film Kochadaiiyaan , coming with many Special Features and the film officially Set to release on April 11th. But, the film Theatrical Received a Full level Negative Talk , as many says that it's Looking like an Cartoon Movie and may not Attract the Audience from the Tollywood and south film Audience.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more