»   » 2013: డబ్బింగ్ చిత్రాలు..ఏది హిట్? ఏది ఫట్?

2013: డబ్బింగ్ చిత్రాలు..ఏది హిట్? ఏది ఫట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మంచి చిత్రాలు ఆదరించడంలో మన తెలుగువారు ఎప్పుడూ ముందుంటారు. అదే విషయం ఇతర భాషల్లోనుంచి డబ్బింగ్‌ అయి విజయవంతం అయిన చిత్రాలు నిరూపించాయి. భాషాబేధం లేకుండా సినిమా నచ్చిందంటే దానిని హిట్‌ చేస్తారు మన ప్రేక్షకులు. సినిమా మనదా? పొరుగూరు నుంచి వచ్చిందా? అనే విషయం అనవసరం. శుక్రవారం ఓ కొత్త సినిమా కావాలంతే. అది బాగుందనిపిస్తే చాలు... మళ్లీ మళ్లీ వెళ్లి చూసొస్తాం. 2013లో అరవై పైచిలుకు అనువాద చిత్రాలు విడుదలైనట్టు తెలుస్తోంది.

అందులో ఉన్నది పరభాషా హీరో అయినా జైకొట్టి వస్తాం. ఇంకా నచ్చితే ఓ అభిమాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. వేరే భాషకు చెందిన ఓ హీరో రూ: 40 కోట్ల మేర మార్కెట్‌ని ఇక్కడ సంపాదించుకొన్నారంటే మన హృదయం ఎంత విశాలమో అర్థం చేసుకోవచ్చు. ఆ అభిరుచిని తెలుసుకొనే అనువాద చిత్రాలు మన బాక్సాఫీసుపై దండెత్తుతుంటాయి. మన సినిమాలతో పోటీపడి మరీ వసూళ్లు సాధిస్తాయి.

గత కొన్నేళ్లుగా మన భాక్సాఫీస్ గళ్లాపెట్టెలో సింహభాగం వాటాని డబ్బింగ్ చిత్రాలే సొంతం చేసుకొని వెళుతున్నాయి. ఆ నమ్మకంతో ఈ యేడాది కూడా బోలెడన్ని అనువాదాలు తెలుగు తెరను పలకరించాయి. అయితే ఇదివరకటితో పోలిస్తే ఆ చిత్రాల ఆటలు అంతగా సాగలేదనే చెప్పాలి. కొన్ని సినిమాలు డబ్బింగ్‌ ఖర్చుల్ని కూడా రాబట్టుకోలేకపోయాయి.
ఇంతకీ ఏ డబ్బింగ్ సినిమా హిట్...ఏ డబ్బింగ్ సినిమా ఫ్లాపు అని విశ్లేషణ సంవత్సరం చివరి నెల సందర్భంగా పరీశీలిస్తే...

స్లైడ్ షోలో... ఏది హిట్..ఏది ఫట్....

విశ్వరూపం

విశ్వరూపం


సాధారణంగా కమల్‌హాసన్‌ సినిమా వస్తోందంటే అందరి చూపులూ అటువైపే మళ్లుతాయి. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన 'విశ్వరూపం' భారీ అంచనాల మధ్య విడుదలైంది. తొలిరోజు వివాదాలు చుట్టుముట్టినా... తర్వాత మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రదర్శితమైంది. అయితే ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు.

కడలి

కడలి


మణిరత్నం 'కడలి' చిత్రం కూడా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధ కూతురు తులసి అందులో హీరోయిన్ కావడంతో ఆ ఆసక్తి ఇంకాస్త ఎక్కువైంది. అయితే ఈసారి మణిరత్నం మాయాజాలం కనిపించలేదు. ఈ చిత్రానికి మణిరత్నం ఇమేజ్‌ కలిసిరాలేదు. ఇంటెన్సిటీ ఉన్న కథే అయినా నేపథ్యం సరిగా కనెక్ట్‌ కాకపోవడంతో ప్లాప్‌గా మిగిలిపోయింది.

ఆట ఆరంభం

ఆట ఆరంభం

తమిళనాట రూ.వంద కోట్ల సినిమాగా మన్ననలు అందుకొన్న 'ఆరంభం' తెలుగులో 'ఆట ఆరంభం' పేరుతో విడుదలైంది. సినిమా బాగానే ఉన్నా.. అజిత్‌కు తెలుగులో అంతగా మార్కెట్‌ లేకపోవడంతో ఇక్కడ వసూళ్లు దక్కలేదు. ఈ ఏడాది రిలీజెై విమర్శకుల ప్రశంసలందుకుంది. ఓ కొత్త నిర్మాత ఈ సినిమా అనువాద హక్కుల్ని విక్రయించి సరెైన ప్రచారం చేయలేకపోవడం పెద్ద మైనస్‌ అయ్యింది. తమిళంలో 100కోట్ల వసూళ్లతో రోబో ని అధిగమించిన సినిమా కాస్తా టాలీవుడ్‌లో నిరాశనే మిగిల్చింది.

విశాల్ చిత్రాలు...

విశాల్ చిత్రాలు...

తెలుగు వాడైన విశాల్ చిత్రాలు తెలుగు,తమిళ భాషల్లో ఒకే సారి విడుదల అయ్యేటట్లుగా ప్లాన్ చేస్తూంటారు. ఆయన చిత్రాలు ... 'వేటాడు వెంటాడు', 'పల్నాడు' రెండూ వర్కవుట్ కాలేదు. రెండూ నష్టాలే తెచ్చిపెట్టాయి.

'అన్న'

'అన్న'

విజయ్ చిత్రం తుపాకి ఓ మాదిరిగా ఆడటంతో ఇక్కడ 'అన్న' చిత్రాన్ని భారీ స్ధాయిలో విడుదల చేసారు. అయితే సరైన కథ,కథనం లేకపోవటడంతో సినిమా పెద్ద డిజాస్టర్ టాక్ ని నమోదు చేసింది.

'వర్ణ'

'వర్ణ'

అనుష్క,సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో భారీ ఎత్తున నిర్మించబట్ట 'వర్ణ' చిత్రం కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే అది కూడా క్రేజ్ ని కొద్దిగా కూడా నిలపకుండా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. గ్రాఫిక్స్, ఆర్య నటన వంటివేమీ ఈ కథ సరిగ్గా లేని చిత్రాన్ని కాపాడలేకపోయాయి. వర్ణకు అనుష్క వల్ల క్రేజు వచ్చినా కథనలోపం, దర్శకత్వ వెైఫల్యం వల్ల ఆకట్టుకోలేకపోయింది.

'పిజ్జా'

'పిజ్జా'

వైవిధ్యమైన స్క్రీన్ ప్లే తో రూపొందిన ఈ లో బడ్జెట్ చిత్రం ఈ యేడాది అనువాద చిత్రాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం మంచి వసూళ్లను రాబట్టుకొంది. దాంతో తక్కువ బడ్జెట్ డబ్బింగ్ చిత్రాలకు మంచి గిరాకీ వచ్చింది. హారర్‌, థ్రిల్లర్‌ జానర్‌కు తెలుగులో మంచి మార్కెట్‌ ఉంటుందని ఈ సినిమా నిరూపించింది.

'సింగం'

'సింగం'

యముడు చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన సూర్య 'సింగం' కూడా వాణిజ్యపరంగా ఆకట్టుకుంది. 'యముడు'కి కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం సూర్య మార్కెట్‌ని పదిలం చేసిందని చెప్పొచ్చు.

హిందీ డబ్బింగ్ లు

హిందీ డబ్బింగ్ లు

తమిళ,కన్నడ డబ్బింగ్ లతో ఉక్కిరి బిక్కిరి అయ్యే మనకు అప్పుడప్పుడు హిందీ డబ్బింగ్ లు మురిపిస్తూంటాయి. ఈ సంవత్సరం విడుదలైన 'క్రిష్‌ 3'కి మల్టీప్లెక్స్‌లలో మంచి వసూళ్లే లభించాయి. 'ధూమ్‌ 3' కూడా సందడి చేస్తోంది.

బిర్యానీ

బిర్యానీ

రెండు పరాజయాలు పొందిన కార్తికి 2013 ముగింపు వూరటనిచ్చింది. ఆయన నటించిన 'బిరియాని' కొత్త రుచుల్ని పంచుతోంది. 'ధూమ్‌ 3'కి పోటీగా వచ్చినా సరే... మంచి వసూళ్లు దక్కాయి. ''బిరియాని నాకు కొండంత భరోసా ఇచ్చింది. కమర్షియల్‌ ఫార్మెట్‌ కథలే కాదు. కొత్తగా ఆలోచించినా విజయాలొస్తాయి అని ఈ సినిమా ఫలితం నిరూపించింది'' అని కార్తి అంటున్నారు. మరి ఈ సినిమాకు ఎన్ని వసూళ్లు దక్కుతాయో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

కన్నడ డబ్బింగ్

కన్నడ డబ్బింగ్

కన్నడ నుంచి వచ్చిన 'దండుపాళ్యం' కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఈ చిత్రంలో వయిలెన్స్ ఎక్కువుగా ఉందని విమర్శలు వినిపించినా... సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించి తెలుగులో దర్శకుడుకి మంచి మార్కెట్ ని క్రియేట్ చేసింది.

'ది ఎటాక్స్‌ 26/11'

'ది ఎటాక్స్‌ 26/11'

ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. వసూళ్లూ ఫర్వాలేదనిపించాయి. వివాదాల వర్మ ది ఎటాక్స్‌ 26/11 కళ్లు తిప్పుకోనివ్వని స్క్రీన్‌ప్లేతో తెరకెక్కింది. ముంబెైలో తీవ్రవాదుల ఘాతుకాల్ని వర్మ కళ్లకుగట్టిన తీరు అతడిలోని సిసలెైన దర్శకుడిని ఆవిష్కరించింది.

English summary

 Telugu Dubbing films are not worked in 2013. From Viswa Roopam to Biryani ..60 films came and flop at Box office.
 
Please Wait while comments are loading...