Dude Day 3 Box Office Collections: బాక్సాఫీస్ వద్ద డ్యూడ్ జోరు.. ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో మమితా బైజు, నేహా శెట్టి హీరోయిన్‌లుగా నటించారు. శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మలు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. డ్యూడ్ చిత్రానికి కీర్తీశ్వన్ దర్శకత్వం వహించారు. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పనిచేశారు. సాయి అభయాంకర్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. అక్టోబర్ 17వ తేదీన డ్యూడ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు ఈ సినిమా ఎన్నికోట్లు రాబట్టిందో చూస్తే..
డ్యూడ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి డ్యూడ్ చిత్రానికి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ప్రదీప్ రంగనాథన్ క్రేజ్, టీజర్, ట్రైలర్లతో డ్యూడ్ మూవీకి మంచి బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... నైజాంలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 4 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్రా, నైజాంలలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 11 కోట్ల రూపాయల షేర్... 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు తెలిపారు.

ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో డ్యూడ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే... తమిళనాడులో 31 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 59 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. ప్రదీప్ రంగనాథన్ మూవీ లాభాల్లోకి రావాలంటే 60 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. డ్యూడ్ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా దాదాపు 550 స్క్రీన్‌లలో విడుదల చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
డ్యూడ్ రెండు రోజుల కలెక్షన్స్
120 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన డ్యూడ్ చిత్రానికి తొలి రోజున ఇండియా వైడ్‌గా 9.75 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ తర్వాత రెండో రోజున 10 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దీంతో రెండ్రోజుల వరకు ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఇండియాలో 19.75 కోట్ల రూపాయల నెట్.. 23 కోట్ల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. రెండ్రోజుల వరకు డ్యూడ్ మూవీకి నార్త్ అమెరికాలో 500K కలెక్షన్స్ (భారత కరెన్సీలో 4.39 కోట్ల రూపాయలు) వచ్చినట్లు ఓవర్సీస్‌లో డ్యూడ్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. వీకెండ్‌లోనూ ప్రదీప్ మూవీకి భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరగడంతో ఈ సినిమా అతి త్వరలోనే డ్యూడ్ చిత్రం 1 మిలియన్ క్లబ్‌లో అడుగుపెడుతుందని భావిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, యూకే, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో డ్యూడ్ మూవీకి 4 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఓవర్సీస్‌లో 8 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ప్రదీప్ రంగనాథన్ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రెండ్రోజుల వరకు 31 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే డ్యూడ్ చిత్రం రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 45 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ చిత్రానికి తొలి రోజున 3.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.75 కోట్ల రూపాయలు చొప్పున రెండ్రోజుల్లో 6 కోట్ల రూపాయలు వసూళ్లు వచ్చాయి. రెండు రోజుల్లో తమిళనాడులో 13.75 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 8 కోట్ల రూపాయలు రాబట్టింది డ్యూడ్.
డ్యూడ్ మూడో రోజు వసూళ్లు
పాజిటివ్ రివ్యలు, మౌత్ టాక్‌తో రంగరాజన్ మూవీకి మూడో రోజు ఆదివారం మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లు ట్రేడ్ వరర్గాలు చెబుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు డ్యూడ్‌కి తమిళంలో 36 కోట్ల శాతం, తెలుగులో 26 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటికే థియేటర్‌లలో ఉన్న కాంతార చాప్టర్ 1, కే ర్యాంప్, తెలుసు కదా, మిత్రమండలి తదితర సినిమాల నుంచి డ్యూడ్‌కి గట్టి పోటీ ఎదురవుతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా మూడో రోజున తమిళంలో 8 కోట్ల రూపాయలు, తెలుగులో 3 కోట్ల రూపాయలు, కేరళ+ కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 30 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 12 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











