twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 1st Week Collections: 17 కోట్ల బిజినెస్.. వారంలో ఊహించని విధంగా.. లాభం ఎన్ని కోట్లంటే!

    |

    గతంలో మాదిరిగా తెలుగులో ఇప్పుడు ఫీల్ గుడ్ సినిమాలు పెద్దగా రావడం లేదు. దీంతో అలాంటి చిత్రాల కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందమైన ప్రేమకావ్యమే 'సీతా రామం'. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ అంచనాలను ఏర్పరచుకుని ఇటీవలే విడుదలైంది. అందరూ ఊహించినట్లుగానే ఈ సినిమాకు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన దక్కింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ మొదటి వారం రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

    అందమైన ప్రేమ కావ్యంగా వచ్చింది

    అందమైన ప్రేమ కావ్యంగా వచ్చింది

    దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి రూపొందించిన చిత్రమే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చారు.

    బద్రీ హీరోయిన్ బాత్రూం వీడియో వైరల్: వామ్మో ఇది చూశారంటే షాకే!బద్రీ హీరోయిన్ బాత్రూం వీడియో వైరల్: వామ్మో ఇది చూశారంటే షాకే!

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్


    అంచనాలకు అనుగుణంగానే 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్ల బిజినెస్ జరిగింది.

    7వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    7వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు


    'సీతా రామం' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 7వ రోజు కలెక్షన్లు బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రూ. 65 లక్షలు షేర్, రూ. 1.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    తెలుగు హీరోయిన్ అందాల ఆరబోత: ఆమె డ్రెస్, ఫోజులు చూస్తే!తెలుగు హీరోయిన్ అందాల ఆరబోత: ఆమె డ్రెస్, ఫోజులు చూస్తే!

    వారం రోజులకు కలిపి ఎంతొచ్చింది

    వారం రోజులకు కలిపి ఎంతొచ్చింది


    'సీతా రామం'కు ఫస్ట్ వీక్‌లో ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.23 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.67 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.01 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 66 లక్షలు, గుంటూరులో రూ. 77 లక్షలు, కృష్ణాలో రూ. 89 లక్షలు, నెల్లూరులో రూ. 42 లక్షలతో కలిపి రూ. 10.93 కోట్లు షేర్, రూ. 20.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    వారం రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 10.93 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.10 కోట్లు, మిగితా భాషల్లో రూ. 3.00 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 7 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 19.18 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 37.80 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ: నితిన్ రెండు షాక్‌లు.. అప్పుడే మూవీకి అలాంటి టాక్మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ: నితిన్ రెండు షాక్‌లు.. అప్పుడే మూవీకి అలాంటి టాక్

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    దుల్కర్ సల్మాన్ - మృనాల్ జంటగా నటించిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లోనే దీనికి రూ. 19.18 కోట్లు వచ్చాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.18 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    భారీగా డౌన్.. థియేటర్ల తగ్గాయిగా

    భారీగా డౌన్.. థియేటర్ల తగ్గాయిగా


    'సీతా రామం' మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. అయితే, ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే ఏడో రోజు భారీగా పడిపోయాయి. అదే సమయంలో ఈ సినిమాకు రెండో వారం థియేటర్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. నేటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కేవలం 270 థియేటర్లలోనే ప్రదర్శితం కాబోతుంది.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 19.18 Cr in 1st Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X