»   » డీజే కలెక్షన్ల హవా.. ట్యూబ్‌లైట్‌ను మించి వసూళ్లు..

డీజే కలెక్షన్ల హవా.. ట్యూబ్‌లైట్‌ను మించి వసూళ్లు..

Written By:
Subscribe to Filmibeat Telugu

సినీ ప్రేక్షకులకు ఈ వారం డబుల్ బొనాంజా. ఎందుకంటే జూన్ 23న తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం (డీజే), హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్‌లైట్ చిత్రాలువిడుదలయ్యాయి. అయితే డీజే చిత్రం డివైడ్ టాక్ సంపాదించుకోగా, ట్యూబ్‌లైట్ చిత్రం ఏకంగా ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే కలెక్షన్ల పరంగా శనివారం నాటికి డీజే ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్లు వసూళు చేసింది. అలాగే ట్యూబ్‌లైట్ రూ.34 కోట్లు వసూలు చేసింది.

Duvvada Jagannadham beats Tubelight collections

దువ్వాడ జగన్నాథం చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1350 స్క్రీన్లలో రిలీజ్ కాగా, ట్యూబ్‌లైట్ చిత్రం 5550 స్క్రీన్లలో విడుదలైంది. సినిమా టాక్ పూర్తిగా నెగిటివ్‌గా ఉన్నా ట్యూబ్‌లైట్ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. అమెరికాలో దువ్వాడ జగన్నాథం కలెక్షన్ల హవా జోరుగానే కొనసాగతున్నది. శనివారం ఫస్ట్ షో వరకు (భారత కాలమానం 5.20 గంటల వరకు) రూ.3.39 కోట్లు వసూలు చేసింది అని ప్రముఖ ట్రేడ్అనలిస్టు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్‌లైట్ చిత్రాన్ని మించి డీజే వసూళ్లను సాధిస్తున్నదని ట్వీట్‌లో పేర్కొన్నారు.


Duvvada Jagannadham beats Tubelight collections

English summary
Trade analyst Taran Adarsh tweeted that DuvvadaJagannadham collects a SOLID $526,355 [₹ 3.39 cr] in USA till 5.20 pm IST... Much bigger start than #Tubelight [No 16 at USA BO].
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu