»   » దుమ్ము రేపుతున్న దువ్వాడ.. ఓవర్సీస్‌, ఏపీ, నైజాంలో కలెక్షన్ల వరద

దుమ్ము రేపుతున్న దువ్వాడ.. ఓవర్సీస్‌, ఏపీ, నైజాంలో కలెక్షన్ల వరద

Written By:
Subscribe to Filmibeat Telugu

క్రిటిక్స్ విమర్శలకు ధీటుగా సమాధానమిస్తూ ఓవర్సీస్ మార్కెట్‌లో దువ్వాడ జగన్నాథం దూసుకెళ్తున్నది. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో ప్రదర్శించిన ప్రీమియర్ షోల ద్వారా మంచి కలెక్షన్లు రాబట్టినట్టు సమాచారం. గతంలో సరైనోడు, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వసూలు చేసిన కలెక్షన్ల రికార్డులను దువ్వాడ జగన్నాథం అధిగమించినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్ హిట్ డీజే నిలిచినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అమెరికాలో భారీ కలెక్షన్లు

అమెరికాలో భారీ కలెక్షన్లు

డీజేకు సంబంధించి ఓవర్సీస్ థియేటర్ హక్కులు దాదాపు రూ.7 కోట్లకు డిస్టిబ్యూటర్లు కొనుగోలు చేశారు. అమెరికాలో 300 స్క్రీన్లలో, కెనడాలో 10 స్కీన్లలో షోలు వేశారు. డీజే సినిమాకు అడ్వాన్సు బుకింగ్ భారీ స్పందన వచ్చింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే డీజే రూ. 26.4 కోట్లు (400000 డాలర్లు) వసూలు చేసినట్టు సమాచారం.


సరైనోడు, సత్యమూర్తిని అధిగమించిన..

సరైనోడు, సత్యమూర్తిని అధిగమించిన..

గతంలో ప్రీమియర్ షోల ద్వారా సరైనోడు 190796 డాలర్లు సన్నాఫ్ సత్యమూర్తి 347267 డాలర్లు, రేసుగుర్రం 102782 డాలర్ల వసూళ్లను సాధించాయి. కానీ ఆ వసూళ్లను అధిగమించి డీజే 400000 డాలర్లను వసూలు చేయడం గమనార్హం. ఈ చిత్రం వారాంతానికి ఒక మిలియన్ డాలర్ల మార్కును చేరుకొనే అవకాశం ఉంది.


మూడు రోజుల్లో రూ.65 కోట్లు

మూడు రోజుల్లో రూ.65 కోట్లు

ఇదిలా ఉండగా, గత మూడు రోజుల్లోనే ఈ చిత్రం మొత్తం రూ.65 కోట్ల వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ అనలిస్టులు వెల్లడిస్తున్నారు. డీజే వసూళ్లను చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయమనేది తేలిపోయింది. సోమవారం కూడా హాలీడే కావడం కలెక్షన్లు పెరగడానికి డీజేకు కలిసి వచ్చింది.


ఆంధ్రా, నైజాంలో వసూళ్ల హవా

ఆంధ్రా, నైజాంలో వసూళ్ల హవా

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ డీజే వసూళ్ల వర్షం కురుస్తున్నది. ఆంధ్రా, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. వారాంతానికి ఆంధ్రా (వైజాగ్ రూ.4.33 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.3.04, పశ్చిమ రూ.2.81, కృష్ణ రూ.2.33, గుంటూరు రూ.3.55, నెల్లూరు రూ.1.60)లో కలిపి మొత్తం షేర్ రూ.17.66 కోట్లు వసూలు చేసింది. సీడెడ్లో రూ.5.50 కోట్లు, నైజాంలో రూ.11.56 కోట్ల వసూళ్లను సాధించింది. ఏపీ, నైజాంలో కలిపి 34.72 కోట్లు (46.8 కోట్లు గ్రాస్) కలెక్షన్లను వసూలు చేసింది.English summary
Allu Arjun's 'Duvvada Jagannadham' has finally hit screens today. As per latest updates the film made a good collection at the US box office in premiere shows. This has broken the records of Allu Arjun's 'Sarainodu' and 'S/o Satyamurthy,' and has turned to be the biggest opener for Allu Arjun in the country.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more