»   » పవన్ 'సర్దార్‌' కూడా 'శ్రీమంతుడు' రూట్ లోనే...

పవన్ 'సర్దార్‌' కూడా 'శ్రీమంతుడు' రూట్ లోనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్‌'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రైట్స్ ని ఈరోస్ వారు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోస్ వారు తాజాగా 'శ్రీమంతుడు' చిత్రం రైట్స్ తీసుకుని రిలీజ్ చేసారు. ఇప్పుడు సర్దార్ కూడా వారే తీసుకోవటంతో బిజినెస్ వర్గాల్లో క్రేజ్ క్రియేట్ అవుతోంది. దాదాపు 70 కోట్లు కు ఈ రైట్స్ ని తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు నిర్మాత శరద్ మరార్ డీల్ పూర్తి చేసినట్లు చెప్తున్నారు.

సర్దార్...చిత్రం విశేషాలకు వెళ్తే..


మొన్న శుక్రవారం 'సర్దార్‌' ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మంచి రెస్పాన్స్ వచ్చిందీ ఫస్ట్ లుక్ కి. పవన్ ఈ చిత్రం షూటింగ్‌లో పవన్‌ బిజీగా గడుపుతున్నారు.


ఇక ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఫైట్స్ సీన్స్ తో ప్రారంభమయ్యింది. కంటిన్యూగా జరుగుతున్న ఈ షెడ్యూల్ కు కొనసాగింపుగా నైట్ షూట్ ప్లాన్ చేసారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రాత్రిపూట ఈ షూటింగ్ జరగనుంది. పవన్ కళ్యాణ్ రెగ్యులర్ షూట్ లో పాల్గొననున్నారు. ఈ సీన్స్ తర్వాత గుజరాత్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.


 Eros also Bags the Rights of Pawan Kalyan's Sardar?

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


పవన్‌ కల్యాణ్‌ ఖాకీ కడితే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో 'గబ్బర్‌ సింగ్‌'లో చూశాం. 'నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ డైలాగులనే బులెట్లులా పేల్చారు అందులో. ఇప్పుడు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ అవతారం ఎత్తబోతున్నాడు.


మరోసారి లాఠీ పట్టి హంగామా చేయబోతున్నాడు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా శరత్‌ మరార్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాబీ దర్శకుడు. ఇంతవరకూ ఈ ప్రాజెక్టు 'గబ్బర్‌సింగ్‌ 2' పేరు మీదే చలామణీ అవుతోంది. ఈ చిత్రానికి ఇప్పుడు సరికొత్త పేరు పెట్టి షూటింగ్ మొదలెట్టారు.


పవన్ కళ్యాణ్ సినిమా ‘గబ్బర్ సింగ్-2'(ఇపుడు టైటిల్ ‘సర్దార్' అని మర్చారు) సినిమా చాలా కాలంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమా తొలిషెడ్యూల్ ప్రారంభం అయినా పవన్ కళ్యాణ్ మాత్రం షూటింగులో పాల్గొనలేదు.


సెకండ్ షెడ్యూల్ నుండి పవన్ కళ్యాణ్ షూటింగులో పాల్గొంటారని చెప్పినా, అదీ ఆలస్యం అవుతూనే వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ నేడు(జులై 29) హైదరాబాద్ లో ప్రారంభం అయింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షూటింగులో జాయిన్ అయ్యారు.


ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఈ చిత్రాన్ని విలేజ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్టు బాధ్యతలు పవన్ కళ్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించారు. తనకు నచ్చిన విధంగా చేర్పులు, మార్పులు చేయించారు.

English summary
Eros International, Bollywood's leading production house and distribution company,now bagging the rights of Pawan Kalyan’s under production film – Sardar.As per the current update, Pawan's Sardar next schedule will commence from yester day night in RFC and the unit will shoot some night scenes in this schedule.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu