twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్,మహేష్ తో డిజాస్టర్స్ ,రజనీతో అయినా...

    By Srikanya
    |

    హైదరాబాద్: ఓ పెద్ద సంస్ద తమ సినిమాకు ఫైనాన్స్ చేస్తున్నారంటే ఎగిరి గంతేస్తారు. అలాంటిది ఈరోస్ ఇంటర్నేషనల్ అంటే భయపడే స్ధితి వచ్చింది. వారు భాషలకు అతీతంగా చేస్తున్న సినిమాలు ఒక్కటి కూడా ఓ మాదిరి కూడా హిట్టవకుండా బోల్తా కొడుతున్నాయి. ఆల్రెడీ మహేష్ తో వారు తెలుగులో 1 నేనొక్కిడినే, ఆగడు చిత్రాలకు ఫైనాన్స్ చేసారు. రెండూ డిజాస్టర్ ఫలితాలు చవి చూసాయి.

    ఇక సల్మాన్ ఖాన్ ఈ మధ్య కాలంలో వరస హిట్లతో దూసుకుపోతూంటే జైహో అంటూ అట్టర్ ఫ్లాప్ ఇచ్చారు. ఆ తర్వాత రజనీ చాలా గ్యాప్ తో చేసిన చతి్రం కొచ్చడియాన్ కు కోట్లు పెట్టారు. అదీ ఓ రేంజిలో డిజాస్టర్ అయ్యింది. అంతే కాదు హిందీలో ఈ మధ్య వచ్చిన ... హ్యాపీ ఎండింగ్, యాక్షన్ జాక్సన్ రెండూ చిత్రాలకు వీరే డబ్బు పెట్టారు. రెండింటి రిజల్ట్ తెలిసిందే. ఇక ఇప్పుడు వారి తాజా ప్రొడక్టు లింగ. అయితే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. వారిని ప్లాపులనుంచి రజనీ బయిటపడేస్తారని అంటున్నారు.

    లింగ విషయానికి వస్తే...

    Eros bags 'Lingaa' world-wide screening rights

    రజనీ హీరోగా నటించిన చిత్రం 'లింగ'. అనుష్క, సోనాక్షిసిన్హా హీరోయిన్స్. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు.

    ''చాలా కష్టపడి 'లింగ'లో నటించాను. కష్టం అంటే ఫైట్లు చేసో ఇంకొకటి చేసో కాదు. కథానాయికలతో డ్యూయెట్లు ఆడి పాడి. దేవుడు నటుల్లో ఎవరికైనా శిక్ష వేయాలంటే... వీడు అరవయ్యేళ్ల తర్వాత డ్యూయెట్లు పాడాలి అంటే చాలు (నవ్వుతూ). సోనాక్షి, అనుష్కలతో కలిసి డ్యూయెట్లు చేయాలన్నప్పుడు తొలి సినిమా కోసం కెమెరా ముందుకొచ్చిన రోజులు గుర్తుకొచ్చాయి'' అన్నారు రజనీకాంత్‌.

    రజనీకాంత్‌ కంటిన్యూ చేస్తూ... ''నాలుగున్నరేళ్ల తర్వాత నటించిన చిత్రమిది. మధ్యలో 'కోచ్చడయాన్‌' వచ్చినా అది యానిమేషన్‌ నేపథ్యంతో కూడుకొన్న చిత్రం. 'లింగ' సినిమా విషయంలో చాలా అద్భుతాలు జరిగాయి. ఇంత పెద్ద సినిమా ఆరు నెలల్లో పూర్తి కావడమంటే మాటలు కాదు. పెద్ద అంటే పెద్దవాళ్లు కలిసి చేసిన సినిమా అని కాదు. ఈ కథ అలాంటిది.

    1938, 40ల్లో ఒక డ్యామ్‌ నిర్మాణం నేపథ్యంగా ఈ చిత్రం సాగుతుంది. రైళ్లు, గుర్రాలు, ఏనుగులు... ఇలా ఎన్నో ఉంటాయి ఈ సినిమాలో. చాలా సన్నివేశాల్లో వెయ్యి మందికిపైగా నటీనటులు కనిపిస్తుంటారు. అంత భారీగా ఇంత తక్కువ సమయంలో చిత్రాన్ని తీసిన దర్శకుడికి హ్యాట్సాఫ్‌ చెప్పాలి. నా సినిమాలతో పరిశ్రమకు ఏదైనా చెప్పాలని ఎప్పుడూ అనుకొనేవాణ్ని. అది ఈ సినిమాతో నెరవేరింది. ఇలా అనుకొన్న సమయంలో సినిమాని పూర్తి చేయాలని 'లింగ'తో చెప్పాను. హాలీవుడ్‌లో కూడా సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి సమయం పడుతుంది తప్ప.. ఒక్కసారి సెట్స్‌పైకి వెళ్లారంటే కొన్ని నెలల్లోనే పూర్తి చేస్తారు.

    కె.విశ్వనాథ్‌, జగపతిబాబులాంటి వాళ్లతో కలిసి ఈ సినిమాలో నటించాను. జగపతిబాబు చిత్ర పరిశ్రమలో నాకు కనిపించిన మరొక మంచి వ్యక్తి. మా స్నేహం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ సినిమాలో నన్ను చాలా కష్టపడి అందంగా చూపించారు (నవ్వుతూ). ఇద్దరమ్మాయిలతో డ్యూయెట్టు చేయడం చాలా కష్టంగా అనిపించింది. సోనాక్షిసిన్హా నా కూతుళ్లు సౌందర్య, ఐశ్వర్యలతోపాటే పెరిగింది. నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ ఎంతో తపనతో ఈ సినిమా పూర్తి చేశాడు. తమిళ ప్రేక్షకులు నన్ను ఎలా ప్రోత్సహిస్తున్నారో... తెలుగు ప్రేక్షకులు కూడా అదే తరహాలో ఆదరిస్తున్నారు. ఆ ఆదరణ కొనసాగాలని కోరుకొంటున్నాను.'' అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''రజనీకాంత్‌ పుట్టినరోజుకి మేమిచ్చే ఒక మంచి కానుక ఈ చిత్రం. తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. కె.విశ్వనాథ్‌, జగపతిబాబు, అనుష్క, సోనాక్షి సిన్హా తదితరులతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అందరి సహకారంతో ఈ చిత్రాన్ని అనుకొన్న సమయంలో పూర్తి చేశాం'' అన్నారు.

    కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ ''నాకు రెండు కోరికలు ఉండేవి. ఒకటి బాలచందర్‌, బాపు దగ్గర వారం రోజులపాటు సహాయ దర్శకుడిగా పనిచేయాలని, ఇంకొకటి రజనీకాంత్‌తో సినిమా చేయాలని. కానీ ఆ రెండు కోరికలు తీరలేదు. అయితే ఈ యేడాది 'ఉత్తమ విలన్‌'లో బాలచందర్‌తో కలిసి, 'లింగ'లో రజనీకాంత్‌తో కలిసి నటించే అవకాశం దొరికింది. రజనీకాంత్‌ని చూసి నేటితరం చాలా నేర్చుకోవాలి. పెద్దవాళ్లపై ఉండే భక్తి, గౌరవం ఆయనకి శ్రీరామరక్షగా నిలుస్తోంది'' అన్నారు.

    జగపతిబాబు మాట్లాడుతూ ''రజనీకాంత్‌తో కలిసి ప్రయాణం చేయడం గొప్ప అనుభవం. 'ఒకప్పుడు నేను బస్‌ కండక్టర్‌ అనే విషయాన్ని మరిచిపోను' అని చెబుతుంటారు రజనీకాంత్‌. ఇంత ఎత్తుకి ఎదిగినా ఇప్పటికీ గతాన్ని గుర్తు చేసుకొంటున్నారంటే ఆయన మనసు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు'' అన్నారు .

    సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు' సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

    English summary
    The world-wide rights of superstar Rajinikanth’s much-awaited Lingaa has been bagged by Eros International. Lingaa will be released world-wide in Tamil, Telugu and Hindi in December. The movie, directed by K.S.Ravikumar, has Rajinikanth reprising a dual role. It is the Tamil film debut for Bollywood actor Sonakshi Sinha, while Anuskha Shetty plays the second female lead. Oscar winning composer A.R.Rahman has scored the music and Rockline Entertainment has produced the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X