»   » ఓవర్ నైట్ డీల్ : మహేష్ సినిమా ఈసారి కూడా 'ఈరోస్' చేతికే

ఓవర్ నైట్ డీల్ : మహేష్ సినిమా ఈసారి కూడా 'ఈరోస్' చేతికే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ గత చిత్రాలు 1 నేనొక్కిడినే, ఆగడు చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఈరోస్ వారు ఈ సారి 'శ్రీమంతుడు' చిత్రం రైట్స్ చేజిక్కించుకున్నారు. ఓవర్ నైట్ లో జరిగిన ఈ డీల్ లో నిర్మాతలు మైత్రీ మేకర్స్, మహేష్ బాగానే లబ్ది పొందినట్లు సమాచారం. ఈ డీల్ తో నిర్మాతలు పూర్తిగా ఫ్రొపిట్ జోన్ లోకి వెళ్లినట్టే అని ట్రేడ్ వర్గాల సమాచారం.

గతంలో మహేష్ రెండు చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఘోరంగా నష్టపోయిన ఈరోస్ వారు ఈ చిత్రంలో లాభాల బాట పడతామని భావిస్తున్నారు. ఈ ఊహించని పరిణామం ట్రేడ్ ఎనాలసిస్ట్ లను ఆశ్చర్యపరిచింది. అయితే ఈరోస్ చేతికి రైట్స్ వెళ్లటం ...కొందరు అభిమానలను సెంటిమెంట్ గా భావిస్తోంది. అయితే సెన్సేషన్ ముందు సెంటిమెంట్స్ పనిచేయవు అని చాలా సార్లు ప్రూవ్ అయిన సంగతే.


EROS Bags Mahesh's movie rights again!!!

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'శ్రీమంతుడు' విషయానికి వస్తే..


మహేష్ బాబు, శ్రుతిహాసన్‌ జంటగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీమంతుడు'. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ యూ బై ఏ ధ్రువీకరణ పత్రం పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 7న శ్రీమంతుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


దర్శకుడు మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఆకట్టుకొంటాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్‌ చాలా సింపుల్‌గా కనిపిస్తారు. కానీ స్త్టెలిష్‌గా ఉంటారు. శ్రుతిహాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సుకన్య... ఇలా ప్రతిపాత్రా కీలకమైనదే. సంభాషణలూ కథకి తగ్గట్టే వినిపిస్తాయి. అవసరాన్ని మించి పంచ్‌ సంభాషణలుండవు'' అన్నారు.


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి,


కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
After distributing movies like '1 Nenokkadine' and 'Aagadu', Eros International has acquired the worldwide rights of 'Srimanthudu' now.
Please Wait while comments are loading...