»   »  బెంగుళూరు, చెన్నైల్లో ఈ రోజే రిలీజ్

బెంగుళూరు, చెన్నైల్లో ఈ రోజే రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సంక్రాంతికి విడుదలైన శర్వానంద్ చిత్రం ‘ఎక్సప్రెస్ రాజా'. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కర్ణాటక, చెన్నైల్లో విడుదల కాలేదు. ఈ రోజు నుంచి అక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని నిర్మాతలు యువి క్రియేషన్స్ వారు భావిస్తున్నారు. ఇప్పటికే యుఎస్ నుంచి కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నట్లు సమచారం.

శర్వానంద్‌ , సురభి హీరోహీరోయిన్స్ గా మేర్లపాక గాంధీ డైరక్టర్ గా రూపొందిన సినిమా ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా'. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకి ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందించారు.


శర్వానంద్‌ చెబుతూ ....‘‘ఈ సినిమాలో ప్రతి పాత్రా కీలకమే. వినోదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. యూవీ క్రియేషన్స్‌ నా సొంత సంస్థ లాంటిది. మేమంతా కలసి చేసిన ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతోంది''అన్నారు.


Express Raja: releases today in Blore, Chennai

.
దర్సకుడు మాట్లాడుతూ...‘‘శర్వానంద్‌తో సినిమా అంటే బెంజ్‌ కారులో ప్రయాణం చేయడమే. అంత హాయిగా ఉంటుంది. ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడు ఈ సినిమాని ప్రేమించి పనిచేశారు.. అందుకే ఓ మంచి సినిమాని అందించాం''అన్నారు.

శర్వానంద్‌, సురభి, ఊర్వ హరీష్‌ ఉత్తమన్‌, పోసాని కృష్ణ మురళి, సూర్య, నాగినీడు బ్రహ్మాజి, సుప్రీత్‌, సప్తగిరి, ప్రభాస్‌ను, షకలకశంకర్‌, ధనరాజ్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ - ప్రవీణ్‌ లక్కరాజు, సినిమాటోగ్రఫి - కార్తిక్‌ గట్టమనేని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ - సందీప్‌.ఎన్‌, ఎడిటర్‌- సత్య.జి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ - ఎస్‌.రవిందర్‌, లిరిక్స్‌ - భాస్కరభట్ల, శ్రీమణి, శ్రీ జో, డ్యాన్స్‌ - రాజు సుందరం, విశ్వ, రఘు, చీఫ్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ - తోట ఫైట్స్‌ - స్టంట్‌ జాషువా,ప్రొడక్షన్‌ కంట్రోలర్స్‌- ఎమ్‌.కష్ణం రాజు (గోపి), మత్తపాటి షణ్ముఖ రావ్‌, పి.ఆర్‌.ఒ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను, పబ్లిసిటి డిజైనర్‌ - వర్కింగ్‌ టైటిల్‌ (శివకిరణ్‌). స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, డైరెక్షన్‌ -మేర్లపాక గాంధి

English summary
Sharwanand's Express Raja will be released in Karnataka and Chennai from today. Directed by Merlapaka Gandhi, Express Raja has music by Praveen Lakkaraju
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu