»   » డీజే నష్టాలు ఫిదాతో భర్తీ.. యమా జోష్‌లో కలెక్షన్లు..

డీజే నష్టాలు ఫిదాతో భర్తీ.. యమా జోష్‌లో కలెక్షన్లు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫిదా చిత్రం నిర్మాత దిల్ రాజుకు కాసుల పంట పండిస్తున్నది. కలెక్షన్లపరంగానే కాకుండా ఒకే క్యాలెండర్ మూడు సక్సెస్‌లు సాధించిన నిర్మాతగా దిల్‌రాజు ఘనతను సాధించారు. ప్రస్తుతం ఫిదా కలెక్షన్లు ప్రపంచవ్యావ్తంగా దుమ్మురేపుతున్నట్టు సమాచారం. మొదటి వారంలో వంద కోట్ల మార్కును దాటే అవకాశం ఉందనే మాట వినిస్తున్నది.

డీజే నష్టాలు ఫిదాతో భర్తీ

డీజే నష్టాలు ఫిదాతో భర్తీ

ఫిదా కంటే ముందు చేసిన చిత్రం దువ్వాడ జగన్నాథం నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాలు సంపాదించినప్పటికీ.. కొంతమంది డిస్టిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయనేది ఫిలింనగర్ టాక్. అయితే ఆ నష్టాలను ఫిదా భర్తీ చేయడం పంపిణీదారులు మంచి జోష్‌లో ఉన్నట్టు సమాచారం.


Fidaa Movie getting record collections all over
మిలియన్ డాలర్ల క్లబ్‌లో ఫిదా

మిలియన్ డాలర్ల క్లబ్‌లో ఫిదా

ఫిదా చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. అమెరికాలో ఇప్పటికే మిలియన్ డాలర్స్ క్లబ్‌లో చేరింది. విడుదలైన రెండు రోజుల్లోపే మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఈ సినిమాకు వస్తున్న ఆదరణను చెప్పకనే చెప్పింది. వారాంతం తర్వాత కలెక్షన్లలో తగ్గుముఖం పట్టకపోగా మరింత పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


అమెరికాలో కలెక్షన్లు

అమెరికాలో కలెక్షన్లు

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అమెరికాలో ఫిదా కలెక్షన్లు ఇలా ఉన్నాయి. శనివారం 363,325 డాలర్లు, శనివారం 351,733 డాలర్లు, ఆదివారం 226,671 డాలర్లు, సోమవారం 159, 384 డాలర్లు, మంగళవారం 173,130 డాలర్లు మేర కలెక్షన్లు ఫిదా నమోదు చేసింది.


సంతోషంలో శేఖర్ కమ్ముల, చిత్ర యూనిట్

సంతోషంలో శేఖర్ కమ్ముల, చిత్ర యూనిట్

ఫిదా చిత్రం ఊహించినట్టే భారీ సక్సెస్‌ను సాధించడంతో చిత్ర యూనిట్, నటీనటుల్లో సంతోషంలో మునిగి తేలుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే శేఖర్ కమ్ములు, సాయి పల్లవి ఈ చిత్ర విజయంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతేడాదికిపైగా పడిన తమ కష్టానికి ప్రేక్షకులు పట్టం కట్టారు అని వారు పేర్కొంటున్నారు.English summary
Fidaa movie gained excellent opening worldwide for first weekend. This is career highest for Varun Tej, Shekhar Kammula. As it surpassed all his previous films full run in just 3 days. The film has grossed over million dollars already in USA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu