»   » దుమ్ము రేపుతున్న ఫిదా కలెక్షన్లు.. 50 కోట్ల క్లబ్‌లో..

దుమ్ము రేపుతున్న ఫిదా కలెక్షన్లు.. 50 కోట్ల క్లబ్‌లో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ఫిదా చిత్రం కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. రిలీజైన రోజు తొలి ఆట నుంచి ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకొన్నది. గత పది రోజుల్లో ఫిదా వసూలు చేసిన కలెక్షన్లు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో థియేటర్లను కూడా పెంచారు. దీంతో ఫిదా మంచి వసూళ్లను రాబడుతున్నది.

50 కోట్ల క్లబ్‌లో..

50 కోట్ల క్లబ్‌లో..

తాజా సమాచారం ప్రకారం గత పది రోజుల్లో ఫిదా చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. స్థూలంగా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. మెగా హీరోల కలెక్షన్లకు అడ్డగా మారిన నైజాంలో ఈచిత్రం కలెక్షన్ల పరంగా కుమ్మెస్తున్నది. నైజాంలోనే ఫిదా చిత్రం రూ.10 కోట్లకు పైగా వసూలు చేసింది.


Sai Pallavi's Fidaa Is The Only Movie After Baahubali
పదిరోజుల్లో రూ.31 కోట్లు

పదిరోజుల్లో రూ.31 కోట్లు

అమెరికాలో ఫిదా చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతున్నది. గత పదిరోజుల్లో ఈ చిత్రం రూ.31 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్ల విషయంలో ఫిదాను ఆపతరం ఎవరివల్ల కాదు. వరుణ్, సాయి పల్లవి నటించిన చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది అని ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా పేర్కొన్నారు.


అమెరికాలో రెండోవారం కూడా

శనివారం అమెరికాలో ఫిదా సినిమా కలెక్షన్లు 74.66 శాతం పెరిగాయి. రెండోవారంలో శుక్రవారం 88,522 డాలర్లు, శనివారం 154,164 డాలర్లు వసూలు చేసింది. రెండోవారంలో రూ.9.83 కోట్లు (1,532,264 డాలర్లు) వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.


వరుణ్ తేజ్ కెరీర్‌లోనే

వరుణ్ తేజ్ కెరీర్‌లోనే

ఓవర్సీస్ మార్కెట్లో కూడా ప్రేక్షకులు ఫిదా చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్నారు. అమెరికాలో ఈ చిత్రం రెండు మిలియన్ల క్లబ్ దిశగా దూసుకుపోతున్నది. ఈ చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.English summary
Varun Tej, Sai Pallavi movie Fidaa is turning out to be a Money-spinner.. Here and USA movie collects 31 Crs Share in 10 Days. Trade analyst Ramesh Bala tweet that This movie is Unstoppable.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu