»   » 6వ స్థానంలో ‘ఫిదా’: టాప్ 10 హిట్స్ ఇవే....

6వ స్థానంలో ‘ఫిదా’: టాప్ 10 హిట్స్ ఇవే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మించిన 'ఫిదా' మూవీ అంచనాలను మించిన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, యూఎస్ఏలో టాప్ 10 హిట్ చిత్రాల లిస్టులో చేరి పోయింది.

యూఎస్ఏలో ఇంకా ఈచిత్రం సక్సెస్ ఫుల్‌గా 16 లొకేషన్లలో రన్ అవుతోంది. తాజాగా 'ఫిదా' మూవీ $2.028 మిలియన్ డాలర్ వసూలు చేయడం ద్వారా 'నాన్నకు ప్రేమతో' సినిమా రికార్డు($2.022 మిలియన్)ను అధిగమించి 6వ స్థానం దక్కించుకుంది.


ఫిదా 5వ స్థానం దక్కించుకోవాలంటే 'ఖైదీ నెం 150' రికార్డు($2.447 మిలియన్)ను బద్దలు కొట్టాలి. అయితే అది అసాధ్యం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. యూఎస్ఏలో టాప్ 10 స్థానంలో ఉన్న సినిమాల వివరాలు.


నెం. 1 బాహుబలి-2

నెం. 1 బాహుబలి-2

బాహుబలి-2 మూవీ యూఎస్ఏలో అన్ని భాషల్లో కలిపి $20.57 మిలియన్ డాలర్లు వసూలు చేసి నెం.1 స్థానంలో ఉంది.Sai Pallavi's Fidaa Is The Only Movie After Baahubali
నెం.2 బాహుబలి

నెం.2 బాహుబలి

2015లో విడుదలైన బాహుబలి-ది బిగినింగ్ $6.99 మిలియన్ డాలర్ వసూలు చేసి రెండో స్థానంలో ఉంది.శ్రీమంతుడు

శ్రీమంతుడు

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఎ‘శ్రీమంతుడు' మూవీ 2.89 మిలియన్ డాలర్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది.అ..ఆ

అ..ఆ

నితిన్-సమంత హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ' మూవీ 2.449 మిలియన్ డాలర్లు వసూలు చేసి నాలుగో స్థానంలో ఉంది.ఖైదీ నెం 150

ఖైదీ నెం 150

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నెం 150' యూఎస్ఏలో 2.447 మిలియన్ డాలర్లు వసూలు చేసి 5వ స్థానంలో ఉంది.ఫిదా

ఫిదా

ఫిదా మూవీ ఇప్పటి వరకు 2.028 మిలియన్ డాలర్ వసూలు చేసింది. ఇంకా రన్ అవుతోంది. అయితే ఈ చిత్రం 5వ స్థానానికి ఎగబాకడం కష్టమే.నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో

సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం 2.022 మిలియన్ డాలర్ వసూలు చేసి 7వ స్థానంలో ఉంది.అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది' మూవీ 1.89 మిలియన్ డాలర్ వసూళ్లతో 8వ స్థానంలో ఉంది.జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్' మూవీ 1.80 మిలియన్ డాలర్లు వసూలు చేసి 9వ స్థానంలో నిలిచింది.గౌతమీపుత్ర శాతకర్ణి

గౌతమీపుత్ర శాతకర్ణి

బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం యూఎస్ఏలో 1.66 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్ 10 లిస్టులో కొనసాగుతోంది.English summary
Fidaa has surpassed the total run of Nannaku Prematho which collected $2.022M. Fidaa currently stands at 6th position among highest grossers of Telugu cinema in USA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu