twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్రస్టింగ్ : ధనుష్ తొలి తెలుగు 50 రోజుల చిత్రం

    By Srikanya
    |

    హైదరాబాద్ : తమిళ హీరో ధనుష్ తన డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో చాలా కాలం నుంచి దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఆపు, అంతులేకుండా సాగుతున్న ఈ పోరాటం అతనికి ప్రతీ సారి అతనికి పరాజయాన్నే మిగిలిస్తోంది. అయితే తాజాగా తెలుగులో ఆయన ఫేట్ మారింది. ఆయన చిత్రం తొలి సారి 50 రోజులు పడింది. వైజాగ్ లో ఆయన తాజా చిత్రం రఘువరన్ బిటెక్ 50 రోజులు ఓ థియోటర్ లో ఆడి రికార్డు క్రియేట్ చేసింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    హిట్టైన తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ లేదా డబ్బింగ్ గా రావటం కొత్తేమీ కాదు. తాజాగా మరో చిత్రం అలా డబ్బింగ్ అయ్యి తెలుగులోకి వచ్చింది. అయితే ఎవరో ఊరూ పేరు లేని బ్యానర్ కాకుండా...తెలుగులో పెద్ద పేరున్న,సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన స్రవంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రం విడుదల అవుతూండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడి ఓపినింగ్స్ వచ్చాయి. దానికి తోడు తమిళంలోనూ ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. ధనుష్‌ హీరోగా నటించిన తమిళ సినిమా ‘వీఐపీ' తెలుగులో ‘రఘువరన్‌ బీటెక్‌'గా విడుదల అయ్యి విజయం సాధించింది.

    First 50 days Telugu movie for Danush

    చిత్రం కథేమిటంటే...

    రఘువరన్(ధనష్) బిటెక్ పూర్తి చేసి గత నాలుగు సంవత్సరాలుగా చేస్తే ఇంజినీరుగానే చేయాలని ఖాలీగా ఉన్న నిరుద్యోగి. ఓ ప్రక్క ఎమ్ సి ఎ చదువుకున్న తన తమ్ముడు సెటిల్ అవుతున్నా అతను మాత్రం తన పట్టుదల విడువడు. అతనికి ఇంట్లో తండ్రి నుంచి అవమానాలు ఎదుర్కొన్నా తల్లి (శరణ్య) పూర్తి సపోర్టు ఇస్తూంటుంది.ఈ లోగా...అతని ఇంటి ప్రక్కన శాలిని(అమలా పాల్) దిగుతుంది. ఆమెతో మొదట పరిచయం తర్వాత ప్రేమ మొదలువుతాయి.

    First 50 days Telugu movie for Danush

    English summary
    Danush scored a big hit in Tamil with his “Velayilla pattadhari” (VIP) that was directed by Velraj. The film features him in an unemployed civil engineer role and Amala Paul as his heroine. This film got dubbed into Telugu as “Raghunvaran B.Tech” and released in January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X