»   » ఈ వారం 5 రిలీజ్ లు ...ఏది చూడచ్చు?

ఈ వారం 5 రిలీజ్ లు ...ఏది చూడచ్చు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్నికల హడావుడి ముగిసింది. జనం చూపు ఇక వినోదంపై పడుతుంది. ఈ సంగతిని పసిగట్టి నిర్మాతలు సినిమాల విడుదలకు సన్నద్ధులైపోయారు. దాంతో మరో సారి చిన్న చిత్రాలన్నీ వరస పెట్టి రిలీజ్ లు అయిపోయాయి.

ఎలక్షన్స్ వేడికి భయపడి పెద్ద సినిమాలు ఏమీ ముందుకు రాని నేపధ్యంలో ఖాళీగా ఉన్న థియోటర్స్ ని ఇవి పలకరించాయి. ఈ ఊపులో బచ్చన్ అనే డబ్బింగ్ చిత్రం సైతం క్యూ కట్టింది. అలాగే కామెడీ ప్రధానంగా సాగే 'అమృతం - చందమామలో', ఏకే రావ్‌ పీకేరావ్‌ చిత్రాలు కూడా వచ్చాయి.

శనివారం ఆరు సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. కాని ఏ సినిమాకు ఓపినింగ్స్ కూడా లేవు. భాక్సాఫీస్ వద్ద పెద్ద ఇంపాక్ట్ చూపని ఆ చిత్రాలేంటి.. వాటి కథేంటో ఓ సారి చూద్దాం.

బచ్చన్‌

బచ్చన్‌

ఓ పోలీస్ అధికారి(ఆశిష్ విధ్యార్ది),డాక్టర్(నాజర్) ని మర్డర్స్ చేస్తాడు భరత్(సుదీప్)..పోలీసులకు దొరికిపోయిన అతన్ని విచారణ అధికారి(విజయ్ కుమార్) ప్రశ్నిస్తాడు. అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ లో భరత్ తాను ఎందుకిలా వారిని చంపాల్సి వచ్చిందో చెప్తాడు. అయితే కథనం రొటీన్ గా ఉందని తెల్చేసారు.

'ఈగ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటుడు సుదీప్‌. ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన కన్నడ చిత్రం 'బచ్చన్‌'. దీన్ని తెలుగులో అదే పేరుతో అనువదించారు. భావన, పరుల్‌ యాదవ్‌ హీరోయిన్స్. జగపతిబాబు ముఖ్య భూమిక పోషించారు. శశాంక్‌ దర్శకత్వం వహించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత.

దిల్లున్నోడు

దిల్లున్నోడు

ట్రావెల్స్ కు ఓనర్ అయిన సాయి(సాయిరామ్ శంకర్) ప్రేమని చైత్ర(జాస్మిన్) రికజ్ట్ చేసి,అవమానం చేస్తుంది. తర్వాత సాయి జీవితంలోకి ప్రవేశించిన సిమ్రాన్(ప్రియదర్శిని) తో ప్రేమలో పడతాడు. ఈ లోగా చైత్ర వెనక్కి అతని జీవితంలోకి వస్తుంది. అప్పుడు సాయి ఏం చేసాడనేది కథ. అయితే కథ,కథనం ఆసక్తిగాలేకపోవటంతో సినిమా బాగోలేదని రిపోర్ట్

ఈ చిత్రంలో సాయిరామ్‌ శంకర్‌ హీరో. జాస్మిన్‌, ప్రియ దర్శిని హీరోయిన్స్. కె.వేణుగోపాల్‌ నిర్మాత. 'బంపర్‌ ఆఫర్‌' వంటి విజయాన్ని తనకు అందించిన దర్శకుడు జయ రవీంద్రతో మరోసారి ఈ చిత్రంతో సాయిరామ్‌శంకర్‌ కలవడం గమనార్హం.

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

క్రికెట్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అంటే ఆ రోజు ఆటలో బాగా ఆడినవాడు. మరి జీవితంలో సమస్యలను ఎదురొడ్డి గెలిచేవాడు. అలాంటి ఓ యువకుడి కథే మా 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అన్నారు దర్శకుడు పి.ఎ. అరుణ్‌ ప్రసాద్‌. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని తేలింది. సాగర్‌, మృదుల జంటగా నటించారు. రాజేంద్రప్రసాద్‌, రాశి ముఖ్యపాత్రధారులు. టైం పాస్ కు కూడా పనికిరాని చిత్రంగా తేల్చారు.

అమృతం - చందమామలో

అమృతం - చందమామలో

తెలుగు ప్రేక్షకుల్లో ప్రాచుర్యం పొందిన ధారావాహిక 'అమృతం'. అమృతం, ఆంజనేయులు, సంజీవని, శాంతి పాత్రలు కూడా తెలుగువారికి బాగా దగ్గరయ్యాయి. ఇప్పుడు ఈ కథను 'అమృతం - చందమామలో'గా వెండితెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు గుణ్ణం గంగరాజు. కథను చందమామపై నడిపించారు. చందమామపై ఇడ్లీల వ్యాపారం చెయ్యాలని ప్రయాణం కట్టే స్కీమ్ తో ముందుకు వచ్చారు. కానీ కథనం టీవి ఎపిసోడ్ మాదిరిగా ఉండటం సినిమాకు మైనస్ అయ్యింది. అవసరాల శ్రీనివాస్‌, ధన్యబాలకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందింది. శివన్నారాయణ, వాసు ఇంటూరిల వినోదం కూడా పెద్దగా ఫలించలేదు

ఏకే రావ్‌ పీకేరావ్‌

ఏకే రావ్‌ పీకేరావ్‌

ఏకేరావ్‌ (ధన్‌రాజ్‌), పీకేరావ్‌ (తాగుబోతు రమేష్‌)లు కృష్ణ భగవాన్ కొట్టిన దెబ్బతో ఓ కేసులో జైలుకి వెళ్లాల్సివస్తుంది. అక్కడ పరిచయమైన ఓ వ్యక్తి వల్ల డాన్‌లుగా మారి బయటకు వచ్చి ఏం చెసారు అనేది కథ. అయితే సినిమాకు సరపడా కథ తయారు చేసుకోకపోవటం ఇబ్బందిగా మారింది. కామెడీ హీరోలు ఉన్నా, కథలో కామెడీ లేకుండా పోయింది.

కోటపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాయి వెంకటేశ్వర కంబైన్స్‌ నిర్మించింది. ఈ చిత్రంలో దక్షా నగర్కర్‌, శ్రుతిరాజ్‌ హీరోయిన్స్ .

English summary
Here is the list of New Movies Released this week in AP. All the movies are small budget films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu