»   » టాలీవుడ్ : ఫ్లాఫ్ హీరో ఆఫ్ ది ఇయిర్

టాలీవుడ్ : ఫ్లాఫ్ హీరో ఆఫ్ ది ఇయిర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Flop Hero of the year!
హైదరాబాద్ : 2013 వెళ్లిపోతోంది. ఎన్ని హిట్స్ వచ్చాయి. ఏ హీరో మీద ఎంత పెట్టుబడి పెడితే ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది నిర్మాతలు లెక్కలు వేసుకుంటున్నారు.

అలాగే వరస ఫ్లాఫ్ లతో ఫ్లాఫ్ హీరో ఆఫ్ ది ఇయిర్ గా ఎవరు ఎంపిక అయ్యేలా కృషి చేసారు వంటివి పరిగణనలోకి వస్తున్నాయి. తాజాగా ఈ ఫ్లాఫ్ హీరో ఆఫ్ ది ఇయిర్

పొజీషన్ కి ఇద్దరు హీరోలు బాగా ట్రై చేసారు. వాళ్లు రామ్, వరుణ్ సందేశ్. అయితే ఎక్కువ ఫ్లాపులతో వరుణ్ సందేశ్ దాన్ని కొట్టుకుపోయారు.

హ్యాపీడేస్ వంటి చిత్రంతో ప్రారంభమైన వరుణ్ సందేశ్ కెరీర్ లో గత రెండు సంవత్సరాలుగా ఫ్లాపులు తప్ప హిట్ అనేది తెలియటం లేదు. ప్రారంభం లో వచ్చిన

హ్యాపీడేస్, కొత్త బంగారులోకం హిట్స్ ని చూసి ఇప్పటికి నిర్మాతలు వెంటబడటం అతనికి వరమయ్యింది. దానికి తోడు శాటిలైట్ మార్కెట్ లో కూడా వరుణ్ సందేశ్ కు

కొద్దో గొప్పో బిజినెస్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవాలని దర్శక,నిర్మాతలు వెంటబడుతూ సినిమాలు చేస్తున్నారు. సినిమా రావటమే పరమావధిగా వరుణ్ సందేశ్

వరసగా చేస్తూ...ఫ్లాపులు ఇస్తూ దూసుకుపోతున్నాడు.

2013 లో వరసగా ఐదు ఫ్లాపులు కొట్టిన ఘనత అతనిదే. చమ్మక ఛల్లో, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ప్రియతమా నీ వచట కుశలమా, సరదగా అమ్మాయితో, ఇక

లేటెస్ట్ ఫ్లాప్ డి ఫర్ దోపిడి. చూస్తూంటే ఈ ఫ్లాఫుల వర్షం ఆగేటట్లు లేదు. 2014 లో వచ్చే సినిమాల కోసం కూడా అతనేమీ మంచి ప్రాజెక్టులు ఒప్పుకున్నట్లు లేదు.

తన రెమ్యునేషన్ ముఖ్యమనుకుంటూ కథ,టెక్నిషియన్స్ ని నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి ఫ్లాపులు తప్పవంటున్నారు. ఇక వరుణ్ సందేశ్ వెనక వస్తున్న రామ్ చేసిన

సినిమాలు తక్కువేగానీ ఎక్కడా హిట్ వాసన తగలటం లేదు. రీసెంట్ గా వెంకటేష్ ని తోడు తెచ్చుకుని సేఫ్ కోసం రీమేక్ చేసినా మసాలా కనీస ఓపినింగ్స్ కూడా

తెచ్చుకోలేక చతికిల పడింది. అయితే రామ్ మీద అయినా ఆశలు ఉన్నాయి కానీ వరుణ్ సందేశ్ పూర్తిగా అదీ కోల్పోయాడు.

English summary
Varun Sandesh had five releases in 2013 (the most for any hero) and he failed to score a hit. Chammak Challo, Abbayi Class 
 
 Ammayi Mass, Priyatama Neevachata Kusalama and Saradaga Ammayitho all have fared pretty badly. His latest release D for 
 
 Dopidi made some buzz before release, but ended up as a damp squib.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu