»   » తెలుగులో ఈ రోజు రిలీజ్ లు,దిల్ రాజు రేటింగ్

తెలుగులో ఈ రోజు రిలీజ్ లు,దిల్ రాజు రేటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ రోజు(శుక్రవారం) తెలుగులో రెండు చిత్రాలు విడుదల అవుతున్నాయి. అందులో ఒకటి కృష్ణాష్టమి. సునీల్ హీరోగా నటించిన ఈ చిత్రం చాలా గ్యాప్ తర్వాత విడుదల అవుతోంది. సునీల్ కెరీర్ లో ఫ్లాఫ్ గా మిగిలిన భీమవరం బుల్లోడు తర్వాత సునీల్ చిత్రం ఏదీ విడుద కాలేదు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవటంతో సునీల్ కు లిట్మస్ టెస్ట్ గా మారింది.

జోష్ తో పరిచయమైన వాసు వర్మ డైరక్ట్ చేసారు. ఆయన తొలి చిత్రం ఫ్లాఫ్ కావటంతో ఈ సినిమాపైనే నమ్మకాలు అన్నీ పెట్టుుకున్నారు. నిర్మాత దిల్ రాజు అయితే ఈ సినిమా పై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే తనే ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చేసాడు. ఆయన చిత్రం ప్రమోషన్ లో మాట్లాడుతూ ఈ రేటింగ్ ని ఇచ్చేసాడు.


దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘రోగి నాడి పట్టుకుని డాక్టర్‌ ఎలా అన్నీ చెప్పేస్తాడో అలా కథను విని అది హిట్‌ అవుతుందో లేదో నేను చెప్పేయగలను. కృష్ణాష్టమి సినిమాకు నేను 3.5 వరకు రేటింగ్‌ ఇస్తాను. 70 శాతం కంటే ఎక్కువ మంది ఇష్టపడే సినిమా అవుతుంది.'' అని చెప్పారు.


Friday releases: Krishnashtami and Malupu

అలాగే...సునీల్‌ ఇప్పటి వరకు ఈ తరహా సినిమా చేయలేదు. ఇందులో అతను కొత్తగా కనిపిస్తాడు. బన్ని కోసం తయారు చేసుకున్న కథే అయినప్పటికీ సునీల్‌ని పెట్టి కూడా అదే రేంజ్‌లో తెరకెక్కించాం. పక్కవాడికి మంచి జరుగుతుందంటే ఎంత దూరమైనా వెళ్ళే కేరక్టర్‌లో సునీల్‌ కనిపిస్తాడు.


Also Read: సైడ్ ఇనకమ్ కోసం: జిమ్, మసాజ్ సెంటర్లలో హీరోయిన్స్


కమర్షియల్‌ పార్మేట్‌లో ఉండే రివెంజ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. సింపుల్‌గా చెప్పాలంటే నీట్‌ ప్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇందులో సునీల్‌ టైప్‌ ఎంటర్‌టైనమెంట్‌ ఉంటుంది. దాదాపు 45 రోజుల పాటు ఫారినలోనే షూట్‌ చేశాం.


ఈ సినిమాను రీ షూట్‌ చేశామని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. కాస్త లెంగ్త్‌ ఎక్కువగా అనిపించి రీ ఎడిటింగ్‌ చేశాం. ‘కృష్ణాష్టమి' సినిమా చూస్తే వాసువర్మ టాలెంట్‌ అందరికీ అర్థమవుతుంది. నేను సినిమాలను మెయిన థియేటర్లలోనే చూడటానికి ఇష్టపడతాను. ఆడియన్స పల్స్‌ అక్కడ బాగా తెలుస్తుంది అని చెప్పారు.


ఈ రోజు విడుదల అవుతున్న మరో చిత్రం మలుపు విషయానికి వస్తే...


ఇంజనీరింగ్ చదువుతున్న నలుగురు కుర్రాళ్లు తమకు ఎదురైన ఓ సమస్య నుంచి ఏ విధంగా బయటపడ్డారు? డిసెంబర్ 31వారి జీవితాల్ని ఎలాంటి మలుపులు తిప్పింది? ఆ రోజు ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రం మలుపు. ఆదర్శ చిత్రాలయ పతాకంపై రవిరాజా పినిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వం వహించారు. తన స్నేహితుల జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా అన్నయ్య సత్యప్రభాస్ ఈ కథను సిద్ధం చేశారు.


నలుగురు యువకుల జీవితాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. సస్పెన్స్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో విమర్శకుల ప్రశంసలను అందుకుంది


ముంబయ్, వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఓ కీలక పాత్రను పోషించారు. దక్షిణాదిలో ఆయన అంగీకరించిన తొలి చిత్రమిది. ఓ ప్రముఖుడి జీవితంతో అతని పాత్రను తీర్చిదిద్దాం. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. కథలోని కొత్తదనం నచ్చడంతో నాన్న రవిరాజా పినిశెట్టి ఈ సినిమాను నిర్మించారు.

English summary
On Friday, Sunil will be testing his luck at box-office after a gap with Krishnashtami. On the other hand, Aadi Pinishetty's new movie Malupu is also releasing on Friday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu