Gabbar singh collections: దిమ్మతిరిగే ఇండస్ట్రీ హిట్‌గా గబ్బర్ సింగ్.. బండ్ల గణేష్ జీవితాన్నే మార్చేసిన పవన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని మరచిపోలేని సినిమాలు ఉన్నాయి. అందులో గబ్బర్ సింగ్ ఒకటి. ఖుషి తరువాత మళ్ళీ ఆ స్థాయిలో విజయం అందుకోవడానికి దాదాపు 11ఏళ్ళు పట్టింది. ఇక ఆ సినిమా అందించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ అంతా ఇంతా కాదు. దెబ్బకు బండ్ల గణేష్ జీవితమే మారిపోయింది. ఇక ఆ సినిమా విడుదలై నేటికి 9 ఏళ్లవుతోంది. బాక్సాఫీస్ వద్ద అందించిన మొత్తం కలెక్షన్స్ ఒక లుక్కేస్తే...

బొడ్డు చూస్తే క్లీన్ బౌల్డ్.. చీరకట్టులో పూజితా పొన్నాడ మరింత హాట్‌గా (ఫోటోలు)

బడ్జెట్ ఎంతంటే

బడ్జెట్ ఎంతంటే

పవన్ కళ్యాణ్ తో పర్ఫెప్ట్ మాస్ సినిమా తీస్తే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆ సినిమాతో అర్ధమయ్యింది. దబాంగ్ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ కంటెంట్ మిస్సవ్వకుండా దర్శకుడు హరీష్ శంకర్ సెట్ చేసుకున్న స్క్రిప్ట్ బాగా హెల్ప్ అయ్యింది. సినిమాను నిర్మాత బండ్ల గణేష్ దాదాపు 30కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

మొదటి షో నుంచే హిట్ టాక్

మొదటి షో నుంచే హిట్ టాక్

ఇక 2012 మే 9న విడుదలైన గబ్బర్ సింగ్ మూవీ మొదటి షో నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమాకు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటలు, హరీష్ శంకర్ డైలాగ్స్, అలాగే రామ్ లక్ష్మణ్ అందించిన ఫైట్స్ ఇలా అన్ని విధాలుగా ఐడియాలు వర్కౌట్ అవ్వడంతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకలను ఆకట్టుకోగలిగింది

ఏపీ, తెలంగాణ షేర్

ఏపీ, తెలంగాణ షేర్

ఇక సినిమాకు సంబంధించిన టోటల్ క్లోజింగ్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే.. ఏరియాల వారిగా వచ్చిన టోటల్ షేర్ ఈ విధంగా ఉంది. నైజాం 19.50 కోట్లు సీడెడ్ 9.30 కోట్లు, ఉత్తరాంధ్ర 5.50 కోట్లు, ఈస్ట్ 3.75 కోట్లు, వెస్ట్ 3.43 కోట్లు, గుంటూరు 4.35 కోట్లు కృష్ణా 3.18 కోట్లు, నెల్లూరు 2.05 కోట్లు.. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏపీ + తెలంగాణ (టోటల్) 51.06 కోట్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 4.80 కోట్లు, ఓవర్సీస్ 4.30 కోట్లు వచ్చాయి.

Recommended Video

Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
చివరికి లాభం ఎంతంటే?

చివరికి లాభం ఎంతంటే?

గబ్బర్ సింగ్ వరల్డ్ వైడ్ షేర్ (టోటల్) 60.16 కోట్లు, ఇక గ్రాస్ కలెక్షన్స్ అప్పట్లో 150కోట్లవరకు వచ్చినట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక రూ.37.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన గబ్బర్ సింగ్ ఫుల్ రన్ టైమ్ లో రూ.60.16 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు ఏకంగా రూ.22.56 కోట్ల లాభాలు దక్కాయని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X