»   »  ఒకే ఒక్క హిట్ సినిమా "గమ్యం"

ఒకే ఒక్క హిట్ సినిమా "గమ్యం"

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ వారం విడుదలైన వేణుమాధవ్ "ప్రేమాభిషేకం" వృధా ప్రయాసగా మిగిలింది. ఒక హిందీ సినిమాను ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమాకు మొదటి ఆట నుంచి కలెక్షన్లు కరువయ్యాయి. అక్కినేని "ప్రేమాభిషేకం"కు పేరడీగా తీసినా కామెడీ వికటించడంతో ప్రేక్షకులు కరువయ్యారు.

నూతన దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ "గమ్యం" కు ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఒక మంచి సినిమా పబ్లిసిటీ పెద్దగా లేకపోయినా ప్రేక్షకుల నోటి మాటతో బాగా ఆడగలుగుతుందన్న సత్యాన్ని ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే పెద్ద బలంగా నిలిచింది. శ్రీహరి "భద్రాద్రి" బి, సి సెంటర్లలో ఫర్వాలేదనిపిస్తున్నా మొత్తమ్మీద కలెక్షన్లు బలహీనంగా ఉన్నాయి. శ్రీకాంత్ హీరోగా వచ్చిన "నగరం" సినిమా సిటీలో కర్ఫ్యూ విధిస్తే ఎలా ఉంటుందో అలా కళా విహీనంగా మిగిలింది.

"మంగతాయారు టిఫిన్ సెంటర్ " సినిమా చద్దిబడిపోయింది. పరీక్షల సీజన్ కావడంతో మొత్తమీద కలెక్షన్లు బలహీనపడ్డాయి. ఈ విషయాన్ని ప్రదర్శకులు ధృవీకరిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X