twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గంగ’ గండం తప్పింది...‘సత్యమూర్తి’ కోలుకున్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్:లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘గంగ' (ముని 3) వస్తే సన్నాఫ్ సత్యమూర్తి కలెక్షన్స్ కు గండి పడినట్లే అని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా ఫైనాన్స్ సమస్యలలో ఇరుక్కుని ఈ చిత్రం రిలీజ్ ఆగిపోయింది. తమిళనాట విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి హిట్ అయ్యింది. తెలుగులోనూ అదే స్ధాయి విజయం వస్తుందని భావించారు. దాంతో సత్యమూర్తికు ఆదరణ తగ్గుతుందని అనుకున్నారు. అయితే ఈ చిత్రం విడుదల కాకపోవటంతో సెకండ్ వీకెండ్ సత్యమూర్తి మళ్లి విజృంభించాడు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ రూపొందించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' మొన్న గురువారం( ఏప్రిల్ 9న)ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది. మార్నింగ్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మొదటివారం వీకెండ్ దాటిన తర్వాత బి,సి సెంటర్లలలో డ్రాప్ బాగా కనపింది. అయితే సెకండ్ వీకెండ్ లో ఈ శనివారం మంచి కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మల్టిఫ్లెక్స్ లు,ఎ సెంటర్లు అన్ని హౌస్ ఫుల్స్ తో రన్ అయ్యాయి. బి,సి సెంటర్లు సైతం డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. దీనికి కారణం...గంగ చిత్రం విడుదల కాకపోవటమే అంటున్నారు.

    Ganga effect on S/O Satyamurthy 2nd Weekend

    అల్లు అర్జున్ సినిమా అంటేనే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది కుటుంబ ప్రేక్షకులను తనదైన సెంటిమెంట్, భావోద్వేగాలు, ఫన్ తో ఆకట్టుకునే త్రివిక్రమ్ జత కలిస్తే ఇంకేముంది. జులాయి ని మించిపోతుంది. ఇప్పుడు అందరి అంచనా ఇదే. దానికి తోడు విభిన్నమైన టైటిల్, అత్తారింటికి దారేది వంటి మెగా హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి, రేసు గుర్రం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ వస్తున్న చిత్రం కావటం మరింతగా అంచనాలు పెంచేసింది. దాంతో టాక్ తో సంభందం లేకుండా ముందుకు వెళ్తోంది.

    విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు. 'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌. తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

    Ganga effect on S/O Satyamurthy 2nd Weekend

    చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఇటీవల వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో...' సినిమాలో రాక్ గిటార్ ప్లేయర్‌గా చేశాను. 'రేసు గుర్రం'లో మధ్యతరగతి అబ్బాయిగా చేశాను. వాటితో పోలిస్తే, 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో నాది కొంత డిగ్నిటీ ఎక్కువున్న పాత్ర. హుందాతనం నిండిన ఆ పాత్రలో కూడా వస్త్రధారణలో ఒక స్టైల్ తెచ్చేందుకు ప్రయత్నించాం. పైగా, నేనెప్పుడూ ఒకటికి నాలుగు అలంకరణలతో నిండిన వస్త్రధారణ చేస్తుంటా. కానీ, పాటలు వదిలేస్తే, ఈ సినిమాలో కావాలనే అవన్నీ వదిలించుకొని, సింపుల్‌గా, సింగిల్ పీస్‌లో ఉండేలా చూశా. దాంతో, నేను కొత్తగా కనిపిస్తాను అన్నారు.

    త్రివిక్రమ్ సినిమాలంటే పంచ్ డైలాగులు ఉంటాయని..సగటు ప్రేక్షకుడ్ని కూడా అలరిస్తాయని అందరికి తెలిసిన విషయమే. ఆయన మాటల్లోని పంచ్‌లు ప్రతి అభిమానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అందుకే ఆయన మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమా ఏదీ చూసిన తన డైలాగుల మార్క్ కనబడుతుంది. దానికి తగ్గట్టుగా త్రివిక్రమ్ డైలాగ్స్‌ ‘సత్యమూర్తి'కి సరికొత్త లుక్‌ని తీసుకొచ్చాడని చెబుతున్నారు.

    ఇప్పుడీ చిత్రం మళయాళ వెర్షన్ ...ఏప్రియల్ 24న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మళయాళ వెర్షన్ కు చెందిన పోస్టర్స్ ,ప్రోమోలుతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యి ఉంది. బిజినెస్ కూడా బాగా జరిగినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో భారీగానే మళయాళంలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి కేరళ భాక్సాఫీస్ వద్ద పరిస్దితి ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ నిత్యామీనన్ ఉండటం కూడా ప్లస్ అవుతుంది.

    English summary
    Last Minute postponement of 'Ganga - Muni 3' due to finance issues came as a blessing in disguise for biggie 'S/O Satyamurthy' .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X