»   » షాక్ ఇచ్చే రేంజిలో రవితేజ 'మిరపకాయ' శాటిలైట్ రైట్స్

షాక్ ఇచ్చే రేంజిలో రవితేజ 'మిరపకాయ' శాటిలైట్ రైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిరపకాయ చిత్రం శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ వారు తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ నాలుగు కోట్లు పలికినట్లు సమాచారం.ఇది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ పలికిన రేటు అంటున్నారు. ఆర్ధిక మాంధ్యం వచ్చిన తర్వాత శాటిలైట్ రైట్స్ బాగా తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమీ లేకపోవటంతో పెద్ద హీరోల చిత్రాలకు బాగానే శాటిలైట్ రైట్స్ వస్తున్నాయి. ఇక యెల్లో ప్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేధ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. రవితేజ చిత్రం కిక్ కు సంగీతం అందించిన తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డాన్ శీను మొదటి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత కలెక్షన్స్ బావుండటంతో ఈ చిత్రంకు కూడా మార్కెట్లో మంచి హైపే వచ్చింది. ఇక హరీష్ శంకర్ గతంలో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన షాక్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఆ చిత్రం మార్కెట్లో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కెమెరా మెన్ గా రాజశేఖర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు. మిరపకాయ ఓ ఫుల్ ప్లెడ్జెడ్ ఎంటర్టైనర్ అని నిర్మాతలు చెప్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడితూ...అంతకు ముందు నా మా కాంబినేషన్లో వచ్చిన షాక్ ఫేట్ ను పట్టించుకోకుండా రవితేజ నేను చెప్పిన కథను బాగా నమ్మి ఈ అవకాశం ఇచ్చారు. అన్నారు. అలాగే నిర్మాత కూడా ఏ లోటూ రానీయకుండా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ మిరపకాయ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామిడీగా మలుస్తున్నాను అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu