»   » షాకిచ్చిన ‘1’ (నేనొక్కడినే) శాటిలైట్ రైట్స్(ఫోటో ఫీచర్)

షాకిచ్చిన ‘1’ (నేనొక్కడినే) శాటిలైట్ రైట్స్(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా యుకెలో షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న '1'(నేనొక్కడినే) చిత్రం శాటిలైట్ రైట్స్ పరంగా రికార్డ్ నెలకొల్పిందని, షాకిచ్చే రేంజిలో ఈ చిత్రం రైట్స్ అమ్ముడుపోయాయని సమాచారం. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని జెమినీ ఛానెల్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏ తెలుగు చిత్రానికి రానంత రేటు..ఈ చిత్రానికి పలికినట్లు ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. అయితే ఎంత అనేది స్పష్టమైన రేట్ మాత్రం బయిటకు రాలేదు.

సన్ నెట్ వర్క్ కు చెందిన ఈ ఛానెల్... '1' (నేనొక్కడినే) తమిళ,మళయాళ డబ్బింగ్ వెర్షన్ రైట్స్ ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి టీజర్స్ ద్వారా వచ్చిన క్రేజ్ రేటు పెరగటానికి కారణమైందని చెప్తున్నారు. ఇంతకముందు మాటీవీ వారు అత్తారింటికి దారేది చిత్రం శాటిలైట్ రైట్స్ ని రికార్డ్ రేటు కు కొనుగోలు చేసారు. ఈ చిత్రం యూకె, ఐర్లాండ్‌లోని వివిధ లోకేషన్లలో షూటింగ్ జరిగింది.

మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇక్కడ అందుకు సంబంధించిన సీన్లతో పాటు యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు చిత్రీకరించారు. దీని తర్వాత ఫైట్ సీన్ల కోసం బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. స్టైలిష్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2014 జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇంత రేటు పలకటానికి కారణాలు...స్లైడ్ షో లో...

టీఆర్పీ రేటింగ్స్...

టీఆర్పీ రేటింగ్స్...

మహేష్ బాబు అతడు సినిమా ఎన్ని సార్లు టీవీలో వచ్చిందో..ఇంకెన్ని సార్లు వస్తుందో లెక్కపెట్టలేము. ఎందుకంటే మహేష్ సినిమాలకు ఫ్యామిలీల ఆదరణ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే టీవిలో మహేష్ సినిమాకు టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజిలో ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మహేష్ సినిమా అంటే ఛానెల్స్ పోటీ పడతాయి.

సంక్రాంతి సెంటిమెంట్

సంక్రాంతి సెంటిమెంట్

మహేష్ బాబు సినిమా సంక్రాంతి వస్తే హిట్టే. ఈ ముగ్గుల పండక్కి.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో సందడి చేశాడు మహేష్‌బాబు. అందులో చిన్నోడి పాత్ర ఇంకా మన కళ్లముందు కదులుతూనే ఉంది. గత సంక్రాంతికి బిజినెస్ మ్యాన్ వచ్చి హిట్టైంది. మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒక్కడు చిత్రం కూడా సంక్రాంతి విడుదల కావటం గమనార్హం. ఈ నేపధ్యంలో మహేష్ కి సంక్రాంతి బాగా కలిసివస్తుందనే సెంటిమెంట్ తోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసాడంటున్నారు. కాబట్టి ఈ సినిమా గ్యారెంటీ హిట్

టీజరే రికార్జ్ ...

టీజరే రికార్జ్ ...

ప్రస్తుతం ఉన్న రికార్డులన్నింటినీ మహేష్‌బాబు ‘1' ‘నేనొక్కడినే' చిత్రం టీజర్ అధిగమించింది. ఈ సినిమా తొలి టీజర్.. కృష్ణ పుట్టినరోజైన మే 31న విడుదల కాగా, పలు వెబ్‌సైట్ల ద్వారా అత్యధిక ప్రేక్షకులు చూసిన టీజర్‌గా రికార్డ్‌కి ఎక్కింది. ఈ నెల 9న మహేష్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ చిత్రం రెండో టీజర్‌ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. ఈ కొత్త టీజర్ కేవలం 3 రోజుల్లోనే పది లక్షల వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. టీజర్ కే ఇంత స్పందన వస్తే సినిమాకు ఎంత ఉంటుందనే ఆలోచన ఛానెల్ వాళ్లను ఉత్సాహపరిచే అంశం.

ఐటం సాంగ్ ...

ఐటం సాంగ్ ...

దర్శకుడు సుకుమార్ తన సినిమాల్లో ఐటం భామలు యమ సెక్సీగా ప్రజెంట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఆయన సినిమాల్లో ఏది ఉన్నా లేక పోయినా...ఐటం సాంగు మాత్రం కేక పుట్టించే రేంజిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘1' సినిమాలో ఐటం సాంగు విషయం కూడా సర్వత్రా చర్చనీయాంశం అయింది. ‘1' సినిమాలో బాలీవుడ్ సెక్సీ ఐటం గర్ల్ సోఫీ చౌదరి స్పెషల్ సాంగు చేయబోతోంది. ఇటీవలే ఆమెపై సాంగు చిత్రీకరణ జరిగింది. మహేష్ బాబు, సుకుమార్‌లతో కలిసి పని చేయడం గొప్పగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించింది సోఫీ చౌదరి.

ట్విట్టర్ లోనూ రికార్డే...

ట్విట్టర్ లోనూ రికార్డే...

మహేష్ బాబు మరో రికార్డు నమోదు చేశాడు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు ట్విట్టర్లో మరో మైలు రాయిని దాటాడు. ఆయన్ను ఫోలో చేస్తున్న అభిమానుల సంఖ్య 6 లక్షల సంఖ్యను దాటింది. తెలుగు హీరోల్లో మహేష్ బాబుకు తప్ప ఈ రేంజ్ లో ఎవరికీ ట్విట్టర్ ఫాలోవర్స్ లేరు. ఇటీవల విడుదలైన మహేష్ బాబు సినిమాలు వరుసగా భారీ విజయం సాధించడం వల్ల మహేష్ బాబు అభిమానుల సంఖ్య మరింత పెరిగిందని, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని సినీ ప్రేమికులు కూడా ఆయన అభిమానుల లిస్టులో చేరారని అంటున్నారు.

మళయాళంలోనూ...

మళయాళంలోనూ...

ఈ చిత్రం టీజర్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రం మళయాళ వెర్షన్ ని సైతం విడుదల చేస్తున్నారు. మళయాళంలో ఈ చిత్రం టైటిల్ '1′( Oruththam'). సౌతిండియా ఫిల్మ్ ఛాంబర్ లో రీసెంట్ గా దీన్ని నిర్మాత రిజిస్టర్ చేసారు.

మహేష్ కొడుకు స్పెషల్ ఎట్రాక్షన్..

మహేష్ కొడుకు స్పెషల్ ఎట్రాక్షన్..

ఇక మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ నటునిగా తెరంగేట్రం చేస్తున్న చిత్రమిది. ఇందులో బుల్లి మహేష్‌గా ఆయన నటిస్తారని తెలుస్తోంది. మహేష్ బాబు కుమారుడుని తెరపై తండ్రితో కలిసి చూడ్డానికి ప్రేక్షకులు తప్పనిసరిగా ఆసక్తి చూపిప్తారు. అదీ ఈ సినిమాకు ప్లస్సే.

డిఫెరెంట్ క్యారెక్టర్..

డిఫెరెంట్ క్యారెక్టర్..

ఇందులో మహేష్ పాత్ర పెక్యులర్‌గా ఉంటుందని, తాను ఒక్కడే అయినా... తన ప్రమేయం లేకుండానే ఇద్దరుగా ప్రవర్తిస్తాడని కొందరంటుంటే... ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా మహేష్.. తన కెరీర్‌లో ఇప్పటివరకూ టచ్ చేయని పాత్ర ‘1'లో చేస్తున్నట్లు మాత్రం వినపడుతోంది. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో హీరోలు ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంటారు. మరి ఇందులో మహేష్ పాత్ర చిత్రణ ఎలా ఉంటుందో అనేది ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్న అంశం.

సిక్స్ ప్యాక్...

సిక్స్ ప్యాక్...


‘1' చిత్రం లో సిక్స్ ప్యాక్ తో కనపడటం కోసం మహేష్ బాబు ఇంటర్నేషనల్ ఫిట్ నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ ఆధ్వర్యంలో తన బాడీ షేప్స్ మార్చుకున్న సంగతి తెలిసిందే. క్రిస్ గెతిన్ ..హృతిక్ రోషన్, జాన్ అబ్రహం కు ఫిట్ నెస్ ట్రైనర్. అయితే వారిద్దరి కన్నా మహేష్ బాగా త్వరగా షేప్ అప్ అయ్యారని క్రిస్ చెప్తున్నారు.

అచ్చొచ్చిన బ్యానర్

అచ్చొచ్చిన బ్యానర్

దూకుడు వంటి సూపర్ హిట్ నిర్మించిన బ్యానర్ వారు..ఇప్పుడీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘1' చిత్రాన్ని 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. దాంతో ఈ చిత్రంపై మంచి అంనాలు ఉన్నాయి.

భారీ బడ్జెట్..

భారీ బడ్జెట్..


ఈ సినిమాకు ఓ రేంజిలో బడ్జెట్ ని నిర్మాతలు కేటాయించారని తెలుస్తోంది. ఇప్పటివరకూ రాని విధంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాలనే ఆలోచనతోనే ఖర్చుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఆ రిచ్ లుక్ తెరపై ఖచ్చితంగా కనపడుతుందని చెప్తున్నారు. సినిమాలో ఉన్న హైలెట్స్ కు ఈ బడ్జెట్ ప్లస్ అవుతుందని చెప్తున్నారు.

ఓ రేంజి...క్రూ..

ఓ రేంజి...క్రూ..

తెరవెనక,తెర ముందు ఈ చిత్రానికి టాప్ పర్శన్స్ పనిచేస్తున్నారు. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Gemini TV, belonging to Sun TV network has bought the satellite rights of Mahesh Babu's 1 Nenokkadine. Sources informed us that the TV channel has paid a whopping price for the rights. It is said that price paid for 1 Nenokkadine is the highest so far. No Telugu film has been bought for this amount. The channel has acquired the rights of Telugu version and also the dubbed versions of Tamil and Malayalam.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu