Just In
- 12 min ago
KRACK వివాదం.. దిల్ రాజు గురించి మాట్లాడే అర్హతే లేదు.. బెల్లంకొండ సురేష్ కామెంట్స్
- 1 hr ago
క్రాక్ ఓటీటీ రిలీక్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతోందంటే?
- 1 hr ago
ఇన్నేళ్లకు ఆ విషయం తెలిసింది.. ఇకపై నేనేంటో చూపిస్తా.. రామ్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
సలార్ సినిమాకు హీరోయిన్ టెన్షన్.. వాళ్ళు ఖాళీగా లేరట
Don't Miss!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Sports
యువరాజ్ సింగ్ పంచుకున్న భరతనాట్యం బౌలింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!వీడియో
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గుడ్ న్యూస్: కలెక్షన్ల సునామీ.. ఏకంగా 200 కోట్ల క్లబ్‌లో..సరికొత్త రికార్డుల దిశగా!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజా సినిమా 'గుడ్ న్యూస్'. డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అక్షయ్ కుమార్- కరీనా కపూర్ జోడీ ఆకట్టుకుంటూ వసూళ్ల ప్రవాహం పారిస్తోంది. తాజాగా ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌లో చేరింది. వివరాల్లోకి పోతే..

దేశ విదేశాల్లో జోష్.. గుడ్ న్యూస్
విడుదలైన మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో చేరి వావ్ అనిపించింది గుడ్ న్యూస్. ఆ తర్వాత కూడా అదే జోష్ కొనసాగిస్తూ వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 161.90 కోట్లు, విదేశాల్లో 45.86 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మొత్తంగా 207.76 కోట్ల వసూళ్లను రాబట్టింది.

కరణ్ జొహార్ ట్వీట్.. పాజిటివ్ రెస్పాన్స్
ఈ మేరకు ఈ విషయాన్ని పేర్కొంటూ నిర్మాత కరణ్ జొహార్ ట్వీట్ చేసారు. ప్రపంచ వ్యాప్తంగా గుడ్ న్యూస్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని తెలుపుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ వివరాలు తెలియజేస్తున్నారు.

రెండు కుటుంబాల మధ్య గందరగోళం
రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన గుడ్ న్యూస్ సినిమాను కృత్రిమ గర్భధారణ నేపథ్యంలో రూపొందించారు. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన గందరగోళం ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ స్టోరీ బీ టౌన్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ విజయం పట్ల అక్షయ్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకులు సందేశాత్మక చిత్రాలను తప్పకుండా ఆదరిస్తారని అన్నారు.

సరికొత్త రికార్డుల దిశగా..
దేశవిదేశాల్లో నేటికీ వస్తున్న ఆదరణ చూస్తుంటే ఈ సినిమా త్వరలోనే 300 కోట్ల క్లబ్ లో కూడా చేరుతుందని తెలుస్తోంది. ముందు ముందు గుడ్ న్యూస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలతో పాటు సినీ విమర్శకులు సైతం పేర్కొంటుండటం విశేషం. గతేడాది ‘కేసరి', ‘మిషన్ మంగళ్', ‘హౌస్ పుల్ 4' సినిమాలతో వినోదం పంచిన అక్షయ్ కుమార్ 'గుడ్ న్యూస్' రూపంలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి జోష్ నింపారు.