twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ని అడ్డం పెట్టి 'దృశ్యం' బిజినెస్

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ చిత్రం రిలీజ్ అంటే ఆడియోకి వచ్చే ఆ క్రేజే వేరు. మొన్నీ మధ్యే అత్తారింటికి దారేది అంటూ సందడి చేసిన పవన్ మరోసారి తన విశ్వరూపం చూపటానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధానపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'గోపాల గోపాల'. శ్రియ ముఖ్య పాత్రధారి. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకుడు. ఈ చిత్రం ఆడియోని, దృశ్యం ఆడియోతో కలిపి 80 లక్షలుకు అమ్మేసారని ట్రేడ్ సమాచారం. లహరి మ్యూజిక్ కంపెనీవారు ఈ ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 'గోపాల గోపాల' ఆడియోకి ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది కాబట్టి ఆ రేటు పెట్టారని, కాంబినేషన్ అని చెప్పినా తీసుకున్నారని అంటున్నారు.

    ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13 , 2015 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కృష్ణుడు పాత్రకు ఉండే గ్రాఫిక్స్ కు ఎక్కువ సమయం పడుతుందని, అందుకే ఈ లేటు అంటున్నారు. హిందీలో విజయవంతమైన 'ఓ మైగాడ్‌'కిది రీమేక్‌. అందులో పరేష్‌ రావల్‌ పోషించిన పాత్రను ఇక్కడ వెంకటేష్‌, అక్షయ్‌ కుమార్‌ చేసిన కృష్ణుడు పాత్రను పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. అలాగే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని...కృష్ణాష్టమి (ఆగస్టు 16) రోజు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

    Gopala Gopala audio rights sold

    పవన్‌కల్యాణ్‌ 'గోపాల గోపాల'లో మోడ్రన్‌ గెటప్ లో కనిపించే శ్రీకృష్ణుడి పాత్రని పోషిస్తున్నారు. ఆ పాత్రలో పవన్‌ పలికే సంభాషణలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ఇంటర్వెల్ వద్ద పవన్ పాత్ర సీన్ లోకి వస్తుందని అంటున్నారు. సెకండాఫ్ లో పవన్ కి, వెంకటేష్ మధ్య వచ్చే సన్నివేశాలు, వారి మధ్య డైలాగులు హైలెట్ గా నిలబడతాయని తెలుస్తోంది.

    సుదీర్ఘకాలం తర్వాత పవన్‌ ఇటీవలే కెమెరా ముందుకొచ్చారు. నడుమునొప్పి వేధిస్తున్నా 'గోపాల గోపాల' కోసం రంగంలోకి దిగారు. వెంకటేష్‌తో కలిసి కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. ముందుగానే స్క్రిప్ట్‌పై అవగాహన పెంచుకొన్న పవన్‌ ఉత్సాహంగా చిత్రీకరణలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఏడాదికి వంద రోజులు సినిమా కోసం కేటాయిస్తానని ఇదివరకే చెప్పారు పవన్‌కల్యాణ్‌. ఆ మేరకు ఇప్పుడు 'గోపాల గోపాల' కోసం కాల్షీట్లు ఇచ్చేశారు.

    పవన్‌కల్యాణ్‌ కేటాయించిన కాల్షీట్లు 30రోజుల్లోపే అని మెగా కాంపౌండ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి ఆయన ఈయేడాది మరో సినిమా కూడా చేస్తారని అర్థమవుతోంది. 'గోపాల గోపాల' తర్వాత చేయబోయే సినిమాల గురించి కూడా పవన్‌ ఇప్పుడు కసరత్తులు మొదలుపెట్టారని తెలుస్తోంది. కొత్త కథలు వింటున్నట్టు సమాచారం.

    English summary
    ‘Gopala Gopala’ makers has sold the audio rights to Lahari Music for Rs.80lakhs including ‘Drushyam’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X