»   »  'లౌక్యం' గా: గోపీచంద్ 'జిల్' ప్రీ రిలీజ్ బిజినెస్

'లౌక్యం' గా: గోపీచంద్ 'జిల్' ప్రీ రిలీజ్ బిజినెస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యు.వీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ హీరోగా గా మిర్చి చిత్రాన్ని నిర్మించిన వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ తాజాగా గోపీచంద్ హీరోగా 'జిల్' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాశిఖన్నా హారోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా చంద్రశేఖర్ ఏలేటి వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన రాధాకృష్ణకుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది ‘జిల్‌' శుక్రవారం విడుదల కానుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే చిత్రానికి సంభదంచిన ట్రైలర్స్ చాలా స్టైలిష్ గా ఉండి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ చిత్రం బిజినెస్ కూడా బాగా జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. లౌక్యం విజయం ప్రభావం ఈ చిత్రం బిజినెస్ పై పడింది. దాంతో ఇరవై కోట్లు వరకూ ఈ చిత్రానికి బిజినెస్ జరగిందని సమాచారం. బ్యానర్,ట్రైలర్స్ లో గోపీ చంద్ లుక్ వంటివి ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసి బిజినెస్ బాగా జరగటానికి తోర్పడ్డాయి.


 Gopichand's 'JIL Distributors & Pre-Release Business

నైజాం: దిల్ రాజు ( 6 కోట్లు)


సీడెడ్: లక్ష్మీ కాంత్ రెడ్డి (2.70కోట్లు)


వైజాగ్: ఎవి సినిమాస్


గుంటూరు: సొంత రిలీజ్


కృష్ణా: 14 రీల్స్


తూర్పు గోదావరి: అనుశ్రీ ఫిల్మ్స్


పశ్చిమ గోదావరి: శ్రీ షన్ముఖ ఫిల్మ్స్ ( 1.25 కోట్లు)


నెల్లూరు: శ్రీ నికేతన్ ఫిల్మ్స్


కర్ణాటక: బికే గంగాధర్


యుఎస్ ఎ: గ్రేట్ మీడియా ఫిల్మ్స్


చిత్రం గురించి రాశిఖన్నా మాట్లాడుతూ... ‘‘‘జిల్‌' సినిమాలో లిప్‌కిస్‌లున్న మాట వాస్తవమే. అయితే వాటిని మేం పొయిటిగ్గాచూశాం. అంతేగానీ అవి వల్గర్‌గా అనిపించే ముద్దులు కాదు'' అని చెప్పుకొచ్చింది రాశీఖన్నా.


ఆమె మాట్లాడుతూ ‘‘నేను ఇంతకు ముందు చేసిన సినిమాలకీ, ఈ సినిమాకీ పొంతన ఉండదు. నా కెరీర్‌కి ప్లస్‌ అయ్యే సినిమా ‘జిల్‌'. ఇందులో నా పాత్ర పేరు సావిత్రి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేస్తుంటాను. చాలా బబ్లీగా, ఎనర్జిటిక్‌గా, వైవిధ్యంగా ఉండే పాత్ర అది. ఈ చిత్రంలో నా వ్యావహారిక శైలి చాలా గమ్మత్తుగా ఉంటుంది. నా కేరక్టర్‌ని పర్టిక్యులర్‌గా ఉండేటట్టు తీర్చిదిద్దాడు మా దర్శకుడు. ఉద్వేగానికి గురైనప్పుడు జుట్టును నోటి దగ్గరకు తెచ్చుకుని లాగుతూ ఉంటాను. పాత్ర పరంగా ట్రెడిషినల్‌గా కనిపించినా, పాటల్లో పూర్తి గ్లామర్‌గా కనిపించాను. హీరో గోపీచంద్‌ సెట్‌లో చాలా ఫన్నీగా ఉండేవారు. నేనెప్పుడైనా డైలాగులు మర్చిపోతే నాకు చెప్పేవారు. అలాగే డ్యాన్సులు వేయడంలోనూ టిప్స్‌ను నేర్పించారు. జిబ్రాన్‌ సంగీతానికి ఇప్పటికే చాలా మంచి పేరు వచ్చింది. పక్కా ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో వస్తున్న సినిమా ఇది'' అని అన్నారు.


గత చిత్రాలకు పూర్తి భిన్నంగా గోపీచంద్ స్టెలిష్ లుక్‌తో కనిపించబోతన్నారు. హీరో గోపీచంద్ కూడా ఈ చిత్రంపై పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇందులో గోపీచంద్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని, ఆయన కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రమవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కమర్షియల్ హంగులతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.


పూర్తి కమర్షియల్ హంగులతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నారు. రన్ రాజా రన్ చిత్రానికి సూపర్ హిట్ సంగీతం అందించిన ఘిబ్రాన్ ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం చేస్తున్నారు.


చిత్రంలో చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి కాస్ట్యూబ్ డిజైనర్: తోట విజయభాస్కర్, ఆర్ట్ : డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్, యాక్షన్: అనల్ అరసు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, శక్తి శరవణన్, మ్యూజిక్: ఘిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.అశోక్ కుమార్ రాజు, ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్

English summary
The Worldwide theatrical business of 'Jil' is around Rs 20 crore.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu