»   » ఫైనల్ గా పెద్ద ఫ్లాఫ్ అని తేల్చారు

ఫైనల్ గా పెద్ద ఫ్లాఫ్ అని తేల్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :గోపిచంద్, రెజీనా కాంబినేషన్‌లో 'సౌఖ్యం' మూవీ తెరకెక్కిన , ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల అయ్యింది. ఏ.ఎస్. రవి కుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫైనల్ గా డిజాస్టర్ గా తేలిపోయింది. వాస్తవానికి నిర్మాతలు భవ్య క్రియేషన్స్ వారు ఓ అరడజను సినిమాలు దాకా చేసారు కానీ లౌక్యం తోనే సాలిడ్ హిట్ పడింది. దాంతో ఉత్సాహంగా అదే టీమ్ తో డైరక్టర్ ని మాత్రమే మార్చి సౌఖ్యం అంటూ వచ్చారు.

మొదట వదలిన ట్రైలర్ చాలా ఎట్రాక్టివ్‌గా ఉండగా, సినిమాపై అభిమానుల్లో అంచనాలు చాలానే పెరిగాయి. అయితే అంచనాలకు కొంచెం కూడా అందుకోలేక చతికిల పడింది. అందుకు కారణం పరమ రొటీన్ కథ, స్క్రీన్ ప్లే, అందుకు తగ్గ సీన్స్ అని తేల్చారు. దురదృష్టవశాత్తు సినిమా సరైన ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది.


 Gopichand's Soukyam flopped miserably

ట్రైలర్ కట్ చేసిన విధానం చూసి గోపిచంద్ గత చిత్రం లౌక్యంలా కామెడీ మరో సారి ట్రై చేసాడేమో అనిపిస్తుంది. అయితే చిత్రం ఏమిటంటే... సినిమా అంతా కామెడీ సీన్స్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి కానీ నిజంగా నవ్వించే కామెడీ సీన్ ఒక్కటీ అరా తప్ప లేవు. దానికి తోడు ఓవర్ బిల్డప్ తో బాహుబలి,శ్రీమంతుడు స్ఫూఫ్ లు చేసారు. అవి కథకు ఉపయోగపడలేదు. నవ్వించలేకపోయాయి.


చిత్రం కథేమిటంటే....


శ్రీను(గోపించంద్) అచ్చ తెలుగు సినిమా బేవార్స్ ..బ్యాచులర్. అతను ఓ రోజున శైలజ(రెజీన) నని చూసి ప్రేమలో పడతాడు. రెండు పాటులు ఓపిగ్గా వేసుకున్న తర్వాత ... ఆమే ఓకే చేస్తుంది. సర్లే వీళ్లద్దరూ ఓకే చేసారు కదా ఇక మనం రంగంలోకి దిగాల్సిన టైం వచ్చిందని విలన్ భావూజీ(ప్రదీప్ రావత్) ఎంట్రీ. ఆ తర్వాత విలన్స్ శైలజ ని ఎత్తుకుబోతారు. అప్పుడు పని దొరికిందన్నట్లు ఉత్సాహంగా... శ్రీను.. సీన్ లోకి దూకి...ఎంత తెలివిగా అందరినీ మస్కా కొట్టి ఆమెను చేజిక్కించుకున్నాడు.. ఆమెను ఇంట్లో వాళ్ల దగ్గర ఒప్పించటానికి ఏం చేసాడు...ఈ సారి హీరో ఎవర్ని బకరా చేసి వాడుకున్నాడు ...ట్రైలర్ చూపెట్టిన పృద్వి, బ్రహ్మానందం, సప్తగిరి ఎప్పుడు వస్తారు..వారి పాత్రలేంటి...కథకు వారికి ఏమన్నా సంభందం ఉందా...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చివరివరకూ చూడాల్సిందే.

English summary
production house Bhavya Creations's latest film Soukyam starring Gopichand went up in the air with the disastrous result .
Please Wait while comments are loading...