For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చారిత్రకం,వినోదం ('రుద్రమదేవి' ‌ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్‌: మనకు చారిత్రక చిత్రాలు చాలా అరుదనే చెప్పాలి. అప్పుడప్పుడు వచ్చినా అవి భక్తిరక ప్రధానంగా ఉండి, అసలు చరిత్రను మరుగుపరిచేలా తయారవుతున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో మన తెలుగు జాతి గొప్పతనాన్ని,మన వారసత్వాన్ని గుర్తు చేస్తూ వస్తున్న చిత్రం 'రుద్రమదేవి' . చిన్నప్పటినుంచీ పాఠాల్లో చదువుకున్న ఈ చరిత్ర ఇప్పుడు కళ్ల ముందు ఉంచారు గుణశేఖర్. రుద్రమదేవి చిత్రం ఈ రోజు( శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుని డబ్బులు పంటను పండిస్తుంది అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.

  ఈ కథాంశానికి సంబంధించిన వాళ్లంతా చాల మంది పెద్ద వయస్కులే. చారిత్రక కథాంశాన్ని యువతరం కోణంలో చెప్పాలనే ఉద్ధేశ్యంతోనే గుణశేఖర్ ఈ సినిమాను తీశారు.

  గుణశేఖర్ మాట్లాడుతూ..... వివిధ రచయితలు రాసిన గ్రంథాల్లో రుద్రమదేవికి సంబంధించి భిన్న కథనాలున్నాయి. వాటి వల్ల నేను కొంత కన్ఫ్యూజన్‌కు గురయ్యాను. చివరకు శిలాశాసనాల్ని ప్రామాణికంగా తీసుకోవాలనే నిర్ణయానికొచ్చాను. వాటి ఆధారంగానే కథ, స్క్రీన్‌ప్లే రాసుకున్నాను. అయితే చరిత్రను ఒక క్రమానుగుణంగా ఎవరు లిఖించలేదు కాబట్టి సంఘటనల మధ్య ఖచ్చితమైన సంబంధాల్ని ఎవరూ నిర్ధారించలేకపోయారు. ఈ విషయంలో నేను సినిమాపరమైన స్వేచ్ఛను తీసుకొని వివిధ సంఘటనల్ని క్రమ పద్ధతిలో రాసుకొని కథను తయారుచేసుకున్నాను. రుద్రమదేవి కథకు పదిశాతం మాత్రమే కాల్పనికతను జోడించి తొంభైశాతం చరిత్రను యథాతథంగా తీసుకున్నాను అన్నారు.

  rudrma3

  తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల్లో ఒకరిగా చెలామణి అవుతున్న అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించబోతూ ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. కాకతీయ చరిత్రలో ప్రాముఖ్యతవున్న గోన గన్నారెడ్డి పాత్రలో ఆయన కనిపించనున్నారు.

  అల్లు అర్జున్ మాట్లాడుతూ... మన సంస్కృతి, చరిత్రను గురించి చెప్పే సినిమా ఇది. ఇలాంటి సినిమాను గుణశేఖర్ ఒక్కరే ధైర్యంగా తెరకెక్కిస్తున్నాడు. సొంతగా నిర్మిస్తున్నారు. కానీ ఆయనకు సహాయం చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ పనిని నేను ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది. దానికోసం ఓ నెల రోజుల సమయం త్యాగం చేస్తే సరిపోతుంది కదా అనిపించింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాను. కొన్ని గొప్ప విషయాలు చేయాలంటే డబ్బు గురించి ఆలోచించకూడదు అని నిర్ణయించుకొని గోన గన్నారెడ్డి పాత్ర చేశాను అని అన్నారు.

  rudrma1

  సినిమాలో ఎవరు, ఏయే పాత్రలు పోషించారు

  అనుష్క : రుద్రమదేవి (టైటిల్ రోల్)
  అల్లు అర్జున్: గోన గన్నారెడ్డి
  రాణా : చాళుక్య వీరభద్రుడి
  కృష్ణం రాజు : గణపతి దేవ చక్రవర్తి
  ప్రకాష్ రాజ్ : మహామంత్రి శివ దేవయ్య
  అజయ్ : ప్రసాదాదిత్య
  కేథరిన్ : అనామిక
  నిత్యామీనన్: ముక్తాంబ
  బాబా సెహగల్ : నాగదేవుడు
  నథాలియా కౌర్ : అన్నాంబిక
  హంసానందిని : మదనిక
  ప్రభ : సోమాంబ

  rudrama2

  ఇక బాహుబలి జానపద కథాంశంతో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం. ఓ చారిత్రక వీరనారి జీవితగాథ ఆధారంగా రూపొందించిన చిత్రం రుద్రమదేవి. కథాంశాల పరంగా రెండు సినిమాల మధ్య చాలా వైరుధ్యాలు కనిపిస్తాయి. కాబట్టి రెండింటిని పోల్చి చూడటం అనవసరం.


  బ్యానర్ :గుణ టీమ్ వర్క్స్
  నటీనటులు: అనుష్క, దగ్గుపాటి రానా, అల్లు అర్జున్, సుమన్‌, ప్రకాష్‌రాజ్‌, నిత్య మేనన్‌, కేథరిన్‌, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మేనన్‌, అజయ్‌ తదితరులు
  సంగీతం: ఇళయరాజా,
  కళ: తోట తరణి,
  ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌,
  మాటలు: పరుచూరి బ్రదర్స్‌,
  ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
  పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి,
  సమర్పణ: రాగిణీగుణ.
  కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం),
  విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్,
  మేకప్ : రాంబాబు,
  నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.
  విడుదల తేదీ: అక్టోబర్ 9, 2015

  English summary
  Gunashekhar has put an great efforts for rudhramadevi and the movie is finally arriving on the oct9th.it is the most awaited movie after baahubali.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X