»   »  "సంక్రాంతి దాకా హవా నడుస్తుంది"

"సంక్రాంతి దాకా హవా నడుస్తుంది"

Posted By:
Subscribe to Filmibeat Telugu


హ్యాపీడేస్ సినిమా పట్ల అద్భుతమైన ఫీడ్ బ్యాక్ లభిస్తోందని ఆ సినిమా దర్శకుడు కమ్ నిర్మాత శేఖర్ కమ్ముల అన్నారు. ప్రేక్షకులు, మీడియా తన సినిమాకు చక్కని పబ్లిసిటీ ఇస్తున్నారని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికి కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న ఈ సినిమా వారిని కదిలిస్తోందని అన్నారు. సకుటుంబ సమేతంగా నచ్చి సినిమాను చూస్తున్నారు. ఈ సినిమా హవా సంక్రాంతి దాకా కొనసాగుతుందనడంలో సందేహంలేదని అన్నాడు. ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ డే ను పురస్కరించుకొని శేఖర్ కమ్ముల, సినిమా పంపిణీదారుడు దిల్ రాజు మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

దిల్ రాజు మాట్లాడుతూ..హ్యాపీడేస్ సినిమా 2007వ సంవత్సరం సన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇది ట్రెండ్ సెట్ సినిమా. ఈ సినిమాలో నటించిన కొత్తవారంతా ఇపుడు పలు అవకాశాలతో బిజీగా మారారు. ఈ సినిమా నాల్గవవారానికి 90 ప్రింట్లకు చేరుకుంది. అయిదవ వారంలో మరిన్ని ప్రింట్లను రూపొందిస్తాం. ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ను ఈ నవంబర్ 5న శిల్పకళావేదిక లో జరుపుతాము. ఆ ఫంక్షన్ లో నూతన సింగర్స్ కోసం పోటీలు నిర్వహిస్తాం. విజేతలు మా భవిష్యత్ సినిమాలలో పాడతారు.

బొమ్మరిల్లు సినిమా విదేశాలలో పెద్ద హిట్ సినిమాలాగానే ఇపుడు హ్యాపీడేస్ సినిమా ఈ సంవత్సరం విదేశాలలో పెద్దహిట్ గా నిలిచింది. నవంబర్ మూడవ వారంలో డల్లాస్ లో జరిగే సినిమా 50 రోజుల ఫంక్షన్ లో శేఖర్ కమ్ముల, సోనియా, వరుణ్ సందేశ్ లు పాల్గొంటారు...అన్నారు.

ఇంకా ఈ ప్రెస్ మీట్ లో నిఖిల్, రాహుల్, మొనాలి చౌధరి, గాయత్రీరావు లు పాల్గొన్నారు.

Read more about: happydays sekhar kammula
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X