»   » 'హార్ట్ ఎటాక్' బిజినెస్: పూరీకి లాభమా? నష్టమా?

'హార్ట్ ఎటాక్' బిజినెస్: పూరీకి లాభమా? నష్టమా?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ :పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో పూరి జగన్నాథ్ రూపొందించిన 'హార్ట్ ఎటాక్' చిత్రం ఈ రోజు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. నితిన్, అదాశర్మ (పరిచయం) జంటగా నటించిన ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఏడు కోట్లు లాభంలో ఉందని సమాచారం. పూరీ జగన్నాథ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఈ చిత్రం బిజినెస్ చేసారని,అందులోనూ ట్రైలర్స్,పోస్టర్స్ కు మంచి క్రేజ్ రావటం,నితిన్ మార్కెట్ బాగుండటంతో రిలీజ్ కు ముందే బిజినెస్ పరంగా హిట్ అయ్యింది.

  ట్రేడ్ లో వినపడుతున్న లెక్కలు ప్రకారం ...ఈ చిత్రం బడ్జెట్ 14 కోట్లు. అయితే మొత్తం బిజినెస్ శాటిలైట్,ఓవర్ సీస్,డిస్ట్రిబ్యూషన్ రైట్స్,ఆడియో అన్ని కలిపి 21 కోట్లు వ్యాపారం నడిచింది. జెమెనీ ఛానెల్ వారు నాలుగున్న కోట్లు పెట్టి శాటిలైట్ రైట్స్ రైట్స్ తీసుకున్నారు. థియోటరకల్ రైట్స్ నిమిత్తం 16.5 కోట్లు(నైజం ఆరు కోట్లు, సీడెడ్ 2.5 కోట్లు, మిగతా ఏరియాల నుంచి 8 కోట్లు )వచ్చింది. దాంతో నిర్మాతగా లాభాలతో పూరీ జగన్నాథ్ ఒడ్డున పడినట్లే అని చెప్తున్నారు.


  Heart Attack Earns Rs 7 Cr Profit Before Its Release

  పూరి జగన్నాథ్ మాట్లాడుతూ "ఇది నేను చాలా రోజుల తర్వాత రూపొందించిన ప్రేమ కథాచిత్రం. ఏ లవ్‌స్టోరీకైనా సంగీతం కీలకమవుతుంది. అనూప్ అద్భుతమైన బాణీలతో అదరగొట్టాడు. నన్ను నమ్మి ఈ సినిమా చూడండి. తప్పకుండా అలరిస్తుంది'' అని చెప్పారు.

  అనూప్, గేయ రచయిత భాస్కరభట్ల కలిసి 'హార్ట్ ఎటాక్' పాటలు సూపర్ సక్సెస్ అయ్యేలా చేశారనీ, పూరి జగన్నాథ్ తరహాలో రూపొందిన ఈ అందమైన ప్రేమకథలో నటించడం ఆనందంగా ఉందనీ హీరో నితిన్ అన్నారు. ఈ చిత్రంలో తన పాత్ర వినోదాన్ని పంచుతూనే చక్కని సందేశాన్ని ఇచ్చేదిగా ఉంటుందని బ్రహ్మానందం తెలిపారు.

  నితిన్, అనూప్ కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' మంచి హిట్టయ్యాయనీ, ఇది వారికి హ్యాట్రిక్ ఫిల్మ్ అనీ అలీ అన్నారు. ఇలాంటి చక్కని లవ్‌స్టోరీకి సంగీతాన్నివ్వడం సంతృప్తినిచ్చిందని అనూప్ రూబెన్స్ చెప్పారు. ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉందని అదాశర్మ తెలిపారు.

  English summary
  
 Puri Jagannadh is all set to make his grand comeback with Heart Attack, which is slated to hit the screens on January 31. The Nitin and Adah Sharma starrer, which has been making huge positive buzz ever since it was announced, has already recovered its production cost and also earned a profit share of Rs 7 crores.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more