»   » తొలివారమే 2300 కోట్లు.. ఈ హారర్ సినిమా చూస్తే.. డాష్ డాష్ పడాల్సిందే..

తొలివారమే 2300 కోట్లు.. ఈ హారర్ సినిమా చూస్తే.. డాష్ డాష్ పడాల్సిందే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా ఓ చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపించిందంటే మహా అయితే రూ. 1000 కోట్లు ఉండొచ్చు. కానీ సెప్టెంబర్ 8న విడుదలైన ఇట్ (ఐటీ) అనే హాలీవుడ్ చిత్రం తొలి వారం రోజుల్లోనే 371 మిలియన్ డాలర్లు (రూ. 2300 కోట్లు) కలెక్షన్లతో బాక్సాఫీసును బద్దలు కొట్టింది. ఇంతకీ ఆ చిత్రం చేస్తున్న కలెక్షన్ల హంగామా ఇదే..

స్టీఫెన్ కింగ్ రచన ఆధారంగా

స్టీఫెన్ కింగ్ రచన ఆధారంగా

ప్రముఖ రచయిత స్టీఫెన్ కింగ్ రచన ఆధారంగా తెరకెక్కిన గొప్ప హర్రర్ చిత్రం ఇట్. ఈ చిత్రం సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై... విమర్శకలను సైతం మెప్పించింది. దీంతో వారు ఈ సినిమాను భిన్న రకాలుగా కీర్తిస్తూ పలు సమీక్షలు రాశారు. సెప్టెంబర్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చిత్రాలను వెనక్కి తొసి... ఈ చిత్రం అగ్రస్థానంలో నిలబడింది.

ఆకాశానికి ఎత్తేసిన రాటెన్ టామాటోస్

ఆకాశానికి ఎత్తేసిన రాటెన్ టామాటోస్

సాధారణంగా రాటెన్ టామాటోస్ అనే వెబ్‌సైట్ ఏ సినిమానైనా చీల్చి చెండాడి సమీక్ష రాస్తుంది. కానీ ఇట్ అనే సినిమాను మాత్రం రాటెన్ టామాటోస్ ఆకాశానికి ఎత్తేసింది. ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించింది.

యూఎస్‌లోను ప్రభంజనం

యూఎస్‌లోను ప్రభంజనం

ఈ చిత్రం యూఎస్‌లో విడుదలై తొలివారంలోనే రూ. 123 మిలియన్ డాలర్ల సంపాదించి... రూ. 60 మిలియన్లతో చేపట్టిన వార్నర్ బ్రదర్స్ ప్రాజెక్ట్‌ను అధిగమించింది. అలాగే భారతదేశంలో ఐటీ విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే రూ. 11 కోట్లు చేజిక్కుంచుకుంది. తమిళనాడులో ఈ చిత్రం స్థానిక చిత్రాలను వెనుకకు నెట్టి అగ్రస్ఠానంలో నిలిచింది.

225 కోట్ల బడ్జెట్‌తో..

225 కోట్ల బడ్జెట్‌తో..

అంతేకాకుండా హార్రర్ చిత్రాలలో ఐటీ చిత్రం అగ్రభాగాన నిలబడింది. ఈ చిత్రం విడుదలై రెండో వారం కావొస్తున్న... ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఐటీ చూసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఈ చిత్రం నిర్మించేందుకు రూ. 35 మిలియన్ డాలర్లు ఖర్చు ( రూ. 225 కోట్లు) అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు.

English summary
It, 2017’s breakout horror hit, has crossed $371 million at the worldwide box office in one week of release. That translates to Rs 2300 crore. The Stephen King adaptation was released on September 8 to record-breaking figures - the film was the highest-grossing horror film and September release of all time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu