For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాని 'శ్యామ్ సింగరాయ్' సినిమాకు మరో భారీ ఓటీటీ ఆఫర్.. టెంప్ట్ అవుతున్న నిర్మాతలు..?

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి ఓటీటీ సంస్థలు ఒక్కసారిగా సినిమా విడుదల హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. అసలు నిర్మాతలకు అమ్మేసే ఆలోచనలో ఉన్నారో లేదో అనే విషయం తెలుసుకోకుండా వారికి నచ్చినంత ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. నిర్మాతలు అసలు ఓటీటీ అనే దానిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోయినా ఆ సంస్థలు చేసే ఆఫర్స్ వలన ఆసక్తి చూపాల్సి వస్తోంది. వచ్చిందే లాభం అనుకొని చాలామంది సినిమాలను డైరెక్ట్ గా డిజిటల్ వరల్డ్ లో విడుదల చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ బిజినెస్ అనేది రిస్క్ తో కూడుకున్న అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అంత ఈజీగా సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశం అయితే లేదు. ఇక నాని సినిమాలు ఇప్పటికే రెండు వరుసగా రెండు ఓటీటీ బిజినెస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలిసిందే. ఇప్పుడు మరో సినిమాకు కూడా భారీగా ఓటీటీ ఆఫర్స్ అయితే వస్తున్నాయట. దీంతో నిర్మాతలు కాస్త టెంప్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు టాక్ వస్తోంది.

   ఓపెనింగ్స్ తోనే పెట్టిన బడ్జెట్ కి వెనక్కి

  ఓపెనింగ్స్ తోనే పెట్టిన బడ్జెట్ కి వెనక్కి


  నేచురల్ స్టార్ నాని మొదటి నుంచి కూడా నిర్మాతలకు ఇష్టమైన హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. ఒక సినిమా సెట్స్ పైకి తెచ్చాడు అంటే వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టును ఫినిష్ చేసేలా చూసుకుంటాడు. ఇక బాక్సాఫీస్ వద్ద అతని సినిమాలకు ఓపెనింగ్స్ తోనే పెట్టిన బడ్జెట్ కి వెనక్కి వచ్చేస్తుంది. నాని సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు అయితే వచ్చేవి.

  V సినిమా అలా..

  V సినిమా అలా..

  గత ఏడాది నాని ఎంతగానో నమ్మకం పెట్టుకున్న V సినిమా థియేటర్స్ లోకి వస్తుందని అందరూ అనుకున్నారు. తనకు ఇష్టమైన మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేసిన V సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో సుధీర్ బాబు మరొక హీరోగా కనిపించాడు. మొదటి సారి కాస్త వైలెన్స్ లో కనిపించిన నాని మొత్తానికి నటనతో అయితే మంచి మార్కులు అందుకున్నాడు. కానీ ఆ సినిమా థియేటర్స్ లోకి వచ్చి ఉంటే అనుకున్న స్థాయిలో విజయం సాధించక పోయేది అని ఒక టాక్ అయితే వచ్చింది. ఆ సినిమాపై ఫైనల్ గా అభిమానులు పెదవి విరిచారు.

  శ్యామ్ సింగరాయ్ కూడా

  శ్యామ్ సింగరాయ్ కూడా

  ఇక ఇతడు ఇటీవల పూర్తి చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం. నష్ట పోకుండా ఉండాలంటే నిర్మతల నిర్ణయానికి ఒప్పుకోక తప్పలేదు అని నాని కూడా కూడా కాస్త ఫీల్ అవుతూ ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాకు ఆఫర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయట. ఆ సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారు.

  OTT లో Ek Mini Katha, Prabhas Facebook Post || Filmibeat Telugu
  భారీ ఆఫర్ వచ్చినా.. టెంప్ట్ అవ్వని నాని

  భారీ ఆఫర్ వచ్చినా.. టెంప్ట్ అవ్వని నాని

  ఇక హాట్ స్టార్ 40 కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అయితే నిర్మాతలు మరికొంత ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మూడోసారి కూడా తన సినిమా ఓటీటీ లోకి వెళుతూ ఉంటే నాని ఏ మాత్రం ఒప్పుకోడు అని చెప్పవచ్చు. అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. అంతేకాకుండా సినిమాను థియేటర్స్ లో చూస్తేనే బావుంటుందని తప్పకుండా వర్కౌట్ అవుతుందమి నిర్మాతలు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడట. మరి నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

  English summary
  Hotstar Offered Huge deal For nani Shyam Singha Roy,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X