twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వార్ కలెక్షన్ల సునామీ.. 200 కోట్లకు చేరువగా.. సైరా, సల్మాన్ మూవీ కలెక్షన్లకు ధీటుగా..

    |

    బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. తొలి రోజునే రూ.51.6 కోట్ల కలెక్షన్ల సత్తాను చూపించిన ఈ చిత్రానికి ఎదురేలేకుండా పోయింది. ఈ లాంగ్ వీకెండ్‌లో కలెక్షన్లను కుమ్మేస్తున్నది. 2019లోనే భారీగా మొదటి రోజు వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును తిరగరాసింది. సైరా, జోకర్ సినిమా నుంచి ఎదురుతున్న గట్టిపోటిని అధిగమించింది. ఈ చిత్రం గత ఐదురోజుల్లో ఎంత సాధించిందంటే..

     150 కోట్ల క్లబ్‌లో

    150 కోట్ల క్లబ్‌లో

    అక్టోబర్ 2వ తేదీన భారీ అంచనాలతో వచ్చిన వార్ చిత్రం తక్కువ స్క్రీన్లలో రిలీజైనప్పటికీ ఎక్కువ వసూళ్లు సాధించింది. . ఈ చిత్రం దేశవ్యాప్తంగా 4 వేల స్క్రీన్లలో రిలీజైన ఈ చిత్రం రోజు రోజుకు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నది. సుదీర్ఘమైన వారాంతాన్ని ఆధారంగా తీసుకొంటే సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన భారత్ చిత్రం రికార్డులను తుడిపేసింది. ఈ చిత్రం అదివారం నాటికి రూ.150 కోట్ల క్లబ్‌లో చేరినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    యష్ రాజ్ బ్యానర్‌లో

    యష్ రాజ్ బ్యానర్‌లో

    ఇక యష్ రాజ్ సినిమా బ్యానర్‌లో వచ్చిన చిత్రాల్లో వార్ చిత్రం మరో విశిష్టతను సొంతం చేసుకొన్నది. ధూమ్3, సుల్తాన్, టైగర్ జిందా హై, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రాల తర్వాత కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టిన ఘనతను సాధించింది. ఇటీవల కాలంలో యష్ రాజ్ బ్యానర్‌లో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన చిత్రం మరోటి కనిపించలేదనే మాట వినిపిస్తున్నది.

    హిందీ, తెలుగు, తమిళ భాషల్లో

    హిందీ, తెలుగు, తమిళ భాషల్లో

    వార్ బీ, సీ సెంటర్లనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రం బుధవారం రూ.51.60 కోట్లు, గురువారం రూ.23.10 కోట్లు, శుక్రవారం రూ.21.30 కోట్లు, శనివారం రూ.27.60 కోట్లు సాధించింది. ఇక మొత్తంగా నాలుగు రోజుల్లో రూ.123.60 కోట్లు సాధించింది. తెలుగు, తమిళం విషయానికి వస్తే.. బుధవారం రూ.1.75 కోట్లు, గురువారం రూ.1.25 కోట్లు, శుక్రవారం రూ.1.15 కోట్లు, శనివారం రూ.1.10 కోట్లు వసూలు చేసింది.

     భారీ రికార్డుపై కన్నేసిన వార్

    భారీ రికార్డుపై కన్నేసిన వార్

    బాక్సాఫీస్ ఊపును ఇలానే కొనసాగితే.. దసరా పండుగ సీజన్‌లో అతిపెద్ద వసూళ్లు సాధించిన చిత్రంగా వార్ చిత్రం నిలిచే అవకాశం ఉంది. వార్ చిత్రం ముందు సైరా, జోకర్ సినిమాల కలెక్షన్లు వెలవెలపోతున్నాయి. అన్ని భాషల్లో ఈ చిత్రం తన మార్కును చూపిస్తున్నది. దసరా రోజున వార్ కలెక్షన్లు పెరిగితే ఇక ఈ సినిమాను ఆపడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని ట్రేడ్ అనలిస్టు తరణ్ భాస్కర్ ట్వీట్ చేశారు.

    English summary
    Bollywood heroes Hrithik Roshan and Tiger Shroff is combined for a Multi starrer movie War. This movie War movie day 4 collections was at 128 crores rupees world wide. War surpasses the Salman Khan's Bharath revenues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X