Allu Arjun: పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్.. బాలీవుడ్ లో హై డిమాండ్.. తగ్గేదేలే!

టాలీవుడ్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప సినిమా కూడా అంచనాలను పెంచుతోంది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అనగానే మొదట ఆర్య లాంటి ప్రేమ సినిమాలే ఎక్కువగా గుర్తుకు వచ్చేవి. కానీ మొదటి సారి వీరి కలయికలో హై వోల్టేజ్ ఊర మాస్ యాక్షన్ డ్రామా రూపొందుతుందని ఎవరు ఉహించ లేదు. పుష్ప సినిమా తప్పకుండా బిగ్ స్క్రీన్ పై ఒక ట్రెండ్ సెట్ చేస్తుందని అనిపిస్తోంది ఎందుకంటే టీజర్ తోనే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.

సుకుమారుడు రంగస్థలం తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా అంతకు మించి ఎలా ఉంటుందని అనుకుంటున్నారు. రంగస్థలం సినిమా తో సుకుమార్ 200 కోట్లు మార్కెట్ ను టచ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ కూడా అల వైకుంఠ పురం సినిమాతో 200 కోట్ల మార్కెట్ ను అందుకున్నాడు. ఇక ఆ స్థాయిలో రికార్డులు అందుకున్న స్టార్ హీరో ప్లస్ దర్శకుడు కలిసి సినిమా చేస్తే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా పుష్ప రాజ్ అయితే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని బాక్సాఫీస్ పండితులు కూడా అంచనా వేస్తున్నారు.

ఇక మొదటి సాంగ్ తో కూడా సినిమా స్థాయి మరో లెవెల్ కు చేరుకోవడం ఖాయమని అనిపిస్తుంది. ఎందుకంటే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఐదు మంది సింగర్స్ తో ఐదు రకాల భాషల్లో మొదటి పాటను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నాడు. ఇటీవల RRR సాంగ్ ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో.. స్పెషల్ గా చెప్పనవసరం లేదు ఇక పుష్ప పాట కూడా ఆ తరహాలో ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రోమో అంచనాలు స్థాయిని ఈజీగా అందుకుంటుందని చెప్పకనే చెప్పేసింది. ఇక సినిమాకు ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ అయినప్పుడు సినిమా బిజినెస్ విషయంలో కూడా డిమాండ్ ఉంటుంది.

Huge demand on allu arjun pushpa bollywood release

ముఖ్యంగా నార్త్ నుంచి మైత్రి మూవీ మేకర్స్ కు భారీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు. మొదట ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తుందా లేదా అనే విషయంలో కొన్ని అనుమానాలు ఉండేది. కానీ ఇప్పుడు చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ వల్ల మంచి డిమాండ్ ఏర్పడుతోంది. బాలీవుడ్ నుంచి బడా నిర్మాణ సంస్థలు సినిమా హిందీ రిలీజ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకా పుష్ప నిర్మాతలు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ముందు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగాన్ని డిసెంబర్లో లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. ఇక పుష్ప 2ను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు.

బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X