Idly Kadai Day 1 Collections: ఇడ్లీ కడాయ్ డే 1 కలెక్షన్లు ఎన్ని కోట్లు.. ధనుష్ మూవీకి షాకింగ్‌గా వసూళ్లు!
టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ నిర్మాతగా, దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం ఇడ్లీ కడాయ్ (తెలుగులో ఇడ్లీ కొట్టు). వంబర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నిత్య మీనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, ఆర్ పార్తీబన్, పీ సముద్రఖని, రాజ్ కిరణ్ తదితరులు నటించారు. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ కలిసి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమాను చెన్నైలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు అధికారులు వెల్లడించిన విషయాల్లోకి వెళితే..
ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫి, ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలను అందించారు. ఈ సినిమాకు కథను కూడా ధనుష్ అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్, ధనుష్ రెమ్యునరేషన్, ఇతర యాక్టర్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం అంతా కలిపి ఈ సినిమాను 110 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం 120 కోట్ల రూపాయల షేర్, 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

ఇక ఇడ్లీ కడాయ్ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమాకు 45 కోట్ల రూపాయల మేర ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకొన్నది. మ్యూజిక్ రైట్స్ కూడా భారీగా అంటే 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. శాటిలైట్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేర జరిగాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను భారీగానే వాల్యూ కట్టారు. ఈ సినిమాను పలు భాషల్లో కమిషన్ బేస్ మీద రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇడ్లీ కడాయ్ చిత్రం బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. తమిళనాడులో ఈ చిత్రం 4 కోట్ల రూపాయలు, కేరళలో 7 లక్షలు, కర్ణాటకలో 19 లక్షలు, ఆంధ్రాలో 19 లక్షలు, తెలంగాణలో 13 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 3 లక్షల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. దాంతో సుమారుగా ఈ చిత్రం 4.5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక సాధారణమైన అంచనాలతో రిలీజైన ఇడ్లీ కడాయ్ చిత్రం పబ్లిక్ టాక్, క్రిటిక్ రివ్యూల అంత సానుకూలంగా కనిపించడం లేదు. గత ధనుష్ మూవీస్‌కు వచ్చిన స్పందన మాదిరిగా ఈ సినిమా భారీగా కలెక్షన్లు నమోదు చేయలేకపోవడం గమనార్హం. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, కేరళ, ఓవర్సీస్ రాష్ట్రాల్లో కలిపి సుమారుగా 7 నుంచి 8 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ధనుష్ నటించిన గత మూడు సినిమాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కెప్టెన్ మిల్లర్ చిత్రం తొలి రోజు 13 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రాయన్ చిత్రం అత్యధికంగా 23.5 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక కుబేరా చిత్రం తొలి రోజు 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఇడ్లీ కడాయ్ చిత్రం మాత్రం ఈ మూడు సినిమాల కంటే తక్కువగా వసూలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











