»   » ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్ట్ (?) సల్మాన్, రజనీ తర్వాత జూ ఎన్టీఆర్!

ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్ట్ (?) సల్మాన్, రజనీ తర్వాత జూ ఎన్టీఆర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన 3వ చిత్రంగా కూడా ఈ చిత్రం ఇటీవలే సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

తాజాగా 'జనతా గ్యారేజ్' సినిమా మరో సంచలన రికార్డు తన సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ 2016 సంవత్సరంలో విడుదలై అత్యధిక షేర్ వసూలు చేసిన ఇండియన్ సినిమాల లిస్టులో ఈ చిత్రం 3వ స్థానాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.

తాజాగా విడుదలైన ఇండియన్ బాక్సాఫీసు రిపోర్టు(అనధికారిక) ప్రకారం....... తొలి స్థానంలొ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, రెండో స్థానంలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారట. ఆ తర్వాత స్థానాన్ని జనతా గ్యారేజ్ సినిమా ద్వారా ఎన్టీఆర్ దక్కించుకున్నాడని ట్రేడ్ వర్గాల టాక్.

సల్మాన్ ఖాన్ మూవీ

సల్మాన్ ఖాన్ మూవీ

2016 సంవత్సరలో అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిచ చిత్రం ‘సుల్తాన్' నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 224 కోట్ల షేర్ వసూలు చేసింది.

రజనీకాంత్ మూవీ

రజనీకాంత్ మూవీ

రెండో స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి' సినిమా ఉంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ రన్ లో రూ. 170 కోట్ల షేర్‌ వసూలు చేసింది. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్లోనే అత్యధిక వసూల్లు సాధించిన సినిమా.

జూనియర్ ఎన్టీఆర్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మూవీ

ఇండియన్ బాక్సాఫీస్ 2016 రిపోర్టు ప్రకారం జనతా గ్యారేజ్ మూడో స్థానంలో ఉంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 80 కోట్ల షేర్‌ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రన్ అవుతోంది. ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరం.

విజయ్ ని వెనక్కి నెట్టిన ఎన్టీఆర్

విజయ్ ని వెనక్కి నెట్టిన ఎన్టీఆర్

నిన్నమొన్నటి వరకు రూ. 78 కోట్ల షేర్ తో విజయ్ నటించిన తమిళ మూవీ ‘తెరీ' మూడో స్థానంలో ఉండేది. జనతా గ్యారేజ్ తాజాగా రూ. 80 కోట్ల షేర్ సాధించడంతో తేరీ చిత్రం నాలుగో స్థానానికి పడిపోయింది.

శ్రీమంతుడు చిత్రాన్ని అధిగమిస్తుందా?

శ్రీమంతుడు చిత్రాన్ని అధిగమిస్తుందా?

తెలుగులో ఇప్పటి వరకు అత్యధిక షేర్ రికార్డ్ బాహుబలి పేరు మీద ఉంది. బాహుబలి తెలుగు వెర్షన్ రూ. 180 కోట్ల షేర్ సాధించింది. తర్వాతి స్థానంలో రూ. 85 కోట్ల షేర్ తో శ్రీమంతుడు మూవీ ఉంది. మరి జనతా గ్యారేజ్ శ్రీమంతుడు రికార్డును బద్దలు కొడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు చిత్రాలకు కొరటాల శివనే దర్శకుడు కావడం విశేషం.

English summary
As per the Indian box office report Janatha Garage in top 3 list. Salman Khan's Sultham movie in first place(Rs. 224 cr share), Rajinikanth's Kabali in 2nd place(rs.170ce share). NTR Blockbuster Janatha Garage ross 80 Cr mark.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu