»   »  ఫైనల్ : మహేష్ బాబు, పవన్ మధ్యే పోరు

ఫైనల్ : మహేష్ బాబు, పవన్ మధ్యే పోరు

Posted By: Staff
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ..టాలీవుడ్ భాక్సీఫీస్ ని శాసిస్తున్న హీరోలు వీరిద్దరూ. అయితే వీరిద్దరి సినిమాలు ఇన్నాళ్లు ఎప్పుడూ స్ట్రైయిట్ గా పోటీపడే అవకాసం రాలేదు. కానీ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ స్టార్ హీరోల సినిమాలు రెండూ భాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నట్లు సమాచారం.

మహేష్ బాబు..బ్రహ్మోత్సవం చిత్రం ఏప్రియల్ 29న విడుదల తేదీ ఖరారు చేయగా, అదే నెలలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సైతం విడుదల అవుతోంది. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు వారాల తేడాలోరిలీజ్ అవుతున్నాయి. ఇది తెలుగు సినీ లవర్స్ కు పండుగలాంటిదే.

It is Mahesh Babu vs Pawan Kalyan

ఇద్దరు హీరోల సినిమాలు తమ తమ చిత్రాల షూటింగ్ లు సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ లోకి ప్రవేశించాలని వేగవంతంగా పనులు చేస్తున్నారు. శ్రీమంతుడు చిత్రంతో మహేష్ బాబు..పవన్ ..అత్తారింటికి దారేది చిత్రం రికార్డులు బ్రద్దలు కొట్టారు. సర్దార్ గబ్బర్ సింగ్ తో పవన్ మరోసారి తన సత్తా చూపించి భాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ కావాలనుకుంటున్నారు.

అదే సమయంలో మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రంపైనా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ఇద్దరి సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ కీలకం కానుంది. సినిమా లవర్స్ మాత్రం ఈ రెండు సినిమాలు..హీరోలతో సంభంధం లేకుండా చూస్తారనేది మాత్రం నిజం.

English summary
Brahmotsavam is releasing on April 29, Pawan Kalyan’s Sardar Gabbar Singh is also being readied for an April release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu