Don't Miss!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
- Automobiles
ఆల్టో కె10 ఎక్స్ట్రా ఎడిషన్ విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి.. వివరాలు
- News
వైసీపీపై పోరాటంలో చంద్రబాబు కొత్త వ్యూహం - ఢిల్లీ కేంద్రంగా..!!
- Finance
Pakistan Crisis: ఓడరేవుల్లో సరుకులు.. పాకిస్థానీలకు మాత్రం ఆకలి కేకలు.. ఎందుకిలా..?
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Itlu Maredumilli Prajaneekam: నరేష్‌కు భారీ షాక్.. 5వ రోజే ఇంత ఘెరమా.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!
తెలుగులో ఎంతో మంది హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా వరుస చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ఒకడు. సుదీర్ఘ కాలం పాటు కామెడీ చిత్రాల్లోనే నటించిన అతడు.. ఈ మధ్య రూటు మార్చేసి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమాతో వచ్చాడు. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా వసూళ్లు దక్కట్లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ 5 రోజుల రిపోర్టు మీకోసం!

మారేడుమిల్లి అంటూ వచ్చారు
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన విలక్షణ చిత్రమే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ తెరకెక్కించిన ఈ మూవీని హస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ నిర్మించారు. ఇందులో ఆనంది హీరోయిన్‌గా నటించింది. శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం అందించారు. ఇందులో ప్రవీణ్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేశారు.
నెట్ డ్రెస్‌లో గబ్బర్ సింగ్ బ్యూటీ: ఈ ఏజ్‌లోనూ మరీ ఇంత ఘోరంగానా!

నరేష్ మూవీ బిజినెస్ డీటేల్స్
ఏపీ, తెలంగాణలో అల్లరి నరేష్‌కు మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 3.65 కోట్లు మేర బిజినెస్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను అన్ని ఏరియాల్లోనూ అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

5వ రోజు ఎంత వచ్చిందంటే?
అల్లరి నరేష్ 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీకి టాక్‌కు అనుగుణంగా కలెక్షన్లు రావట్లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 90 లక్షలు గ్రాస్, రెండో రోజు రూ. 81 లక్షలు గ్రాస్, మూడో రోజు రూ. 70 లక్షలు, నాలుగో రోజు రూ. 30 లక్షలు గ్రాస్‌ను మాత్రమే సొంతం చేసుకుంది. ఇక, ఐదో రోజు ఘోరంగా రూ. 18 లక్షలు గ్రాస్‌తో పాటు రూ. 10 లక్షలు షేర్ కలెక్ట్ చేసింది.
బాత్రూంలో ఏమీ లేకుండా అషు రెడ్డి: సెల్ఫీ వీడియోలో మొత్తం చూపిస్తూ!

5 రోజులకూ ఎంత వచ్చింది?
అల్లరి నరేష్ నటించిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ ఆంధ్రా, తెలంగాణలో ఐదు రోజుల్లో చాలా తక్కువ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఏరియాల పరంగా చూస్తే.. 5 రోజుల్లో ఇది నైజాంలో రూ. 1.13 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.48 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 5 రోజుల్లో ఈ మూవీ రూ. 2.88 కోట్లు గ్రాస్, రూ. 1.51 కోట్లు షేర్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 2.80 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ ప్రపంచ వ్యాప్తంగా కూడా నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 17 లక్షలు వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 3.05 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 1.60 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది.
Hyper Aadi Gundu: హైపర్ ఆదికి చేదు అనుభవం.. గుండు కొట్టించి మరీ.. అమ్మాయి ముద్దు ఎఫెక్ట్

టార్గెట్‌కు ఇంకెంత రావాలి?
హీరో నరేష్ 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.65 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 రోజుల్లో రూ. 1.60 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 2.40 కోట్లు షేర్‌ను రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.