Just In
- 34 min ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 1 hr ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 1 hr ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
- 2 hrs ago
చిత్ర సీమలో విషాదం.. నిర్మాత మృతిపై నారా రోహిత్, సుధీర్ వర్మ ఎమోషనల్
Don't Miss!
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- News
రాహుల్ భయ్యా! మీరు వెకేషన్లో ఉన్నారు: ‘మత్స్యశాఖ’ కామెంట్లపై అమిత్ షా సెటైర్లు
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జాను మూవీ తొలి రోజు కలెక్షన్లు.. ఏ రేంజ్‌లో అంటే.. హిట్టు కొట్టాలంటే ఎంత?
తమిళంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్న 96 చిత్రాన్ని తెలుగు రీమేక్‌గా మలిచిన జాను చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. సినీ విమర్శకులు కూడా మూవీపై సానుకూల కథనాలు వెల్లడించడంతో ఫీల్‌గుడ్ సినిమాగా టాక్‌ను సంపాదించుకొన్నది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీగా బిజినెస్‌ను సొంతం చేసుకొన్నది. అయితే తొలి రోజు ఎంత వసూలు చేస్తున్నదంటే..

రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
దిల్ రాజు నిర్మాతగా సీ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో జాను రొమాంటిక్ డ్రామాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.21 కోట్లుగా నమోదు కావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సమంత, శర్వానంద్ జంట బిజినెస్ ప్రధాన కారణం కాగా.. టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలు పెంచాయి.

తెలుగు రాష్టాల్లో కలెక్షన్లు
తెలుగు రాష్ట్రాల్లో జాను సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా ఇలా నమోదైంది..
నైజాంలో రూ.5.40 కోట్లు
వైజాగ్‌లో రూ. 2.20 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.30 కోట్లు
పశ్చిమ గోదావరిలో రూ.1.10 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.1.30 కోట్లు
గుంటూరులో రూ.1.45 కోట్లు
నెల్లూరులో రూ.0.65 కోట్లు
సీడెడ్‌లో రూ.2.60 కోట్లతో మొత్తం ఏపీ, తెలంగాణలో రూ.16 కోట్ల బిజినెస్ జరిగింది.

ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో
తెలుగేతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో చూసుకొంటే..
కర్ణాటకలో రూ.60 లక్షలు
మిగితా రాష్ట్రాల్లో రూ.10 లక్షలు
ఓవర్సీస్‌లో రూ.4.3 కోట్లతో మొత్తంగా ఈ చిత్రం 21 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది.

లాభాల్లోకి రావాలంటే..
అయితే తొలి రోజు టాక్‌ను పరిగణనలోకి తీసుకొంటే జాను చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.6 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ చిత్రం మొత్తంగా రూ.30 కోట్లకుపైగా వసూళ్లు సాధిస్తే బ్లాక్ బస్టర్‌గా మారే అవకాశం ఉంది. 25 కోట్లకు పరిమితమైతే హిట్ నుంచి సూపర్ హిట్ రేంజ్‌ను నమోదు చేసుకొనే అవకాశం లేకపోలేదు.