Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Jacqueline Fernandez తో రిలేషన్‌షిప్ అలాంటిదే.. రొమాన్స్, హాట్ సెల్ఫీపై మాఫియా డాన్ రియాక్షన్
బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో రొమాంటిక్ ఫోటోలు లీక్ కావడంపై మనీలాండరింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్మన్ సుకేష్ చంద్రశేఖర్ స్పందించారు. జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో అతి సన్నిహితంగా ఉంటూ రొమాన్స్ చేస్తున్న ఫోటోలు లీక్ కావడంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తాను, జాక్వలైన్ కలిసి ఉన్న ఫోటోలు రిలీజ్ కావడంపై ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు వారి రిలేషన్‌పై దృష్టిపెట్టాయి. జాక్వలైన్‌ను పలుమార్లు విచారణకు పిలిచి ప్రశ్నించారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సుఖేష్ చంద్రశేఖర్‌తో డేటింగ్
సుఖేష్ చంద్రశేఖర్‌తో డేటింగ్ వార్తలను జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఖండించింది. అయితే ఆమె ఖండించిన కొద్ది రోజులకే సుకేశ్‌తో రొమాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వెలుగు చూసింది. గత ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో సుఖేశ్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైనప్పుడు జాక్వలైన్ ఆయనతో కలిసి సెల్ఫీ దిగింది. సుఖేష్‌ను కలుసుకోవడానికి జాక్వలైన్ ఫెర్నాండేజ్ నాలుగు సార్లు చెన్నైకి ప్రైవేట్ జెట్‌లో వెళ్లింది అని ఈడీ అధికారులు వెల్లడించారు.

జాక్వలైన్‌కు ముద్దులు పెడుతూ
సుఖేశ్ చంద్రశేఖర్‌తో జాక్వలైన్ ఫెర్నాండేజ్ దిగిన సెల్ఫీ వైరల్ అవుతున్నది. జాక్వలైన్ బుగ్గపై ముద్దు పెడుతూ తన ఫోన్‌తో సెల్ఫీ తీస్తూ ఎదురుగా అద్దంలో చూసుకొంటూ రొమాన్స్‌లో మునిగిపోయారు. జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో దిగిన సెల్ఫీ ఐఫోన్ 12తో తీశాడు. ఇజ్రాయెల్ సిమ్ కార్డుతో కూడిన ఫోన్‌ను సుఖేశ్ వాడారు అని ఈడీ అధికారులు వెల్లడించారు.

అద్దంలో చూసుకొంటూ...
ఆ తర్వాత మాఫియా డాన్ సుఖేష్ చంద్రశేఖర్ గత ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో జైలు నుంచి బెయిల్‌పై విడుదలైనప్పుడు జాక్వలైన్ ఆయనతో దిగిన మరో సెల్ఫీ మీడియాలో వైరల్ అయింది. జాక్వలైన్ బుగ్గపై సుకేష్ ముద్దు పెడుతూ తన ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకొంటూ ఐఫోన్‌తో సెల్ఫీ తీస్తున్న ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది. ఒకరినొకరు చాలా సన్నిహితంగా ఉంటూ ముద్దుల్లో మునిగిపోయారు. వారిద్దరూ రొమాన్స్ మునిగిపోయి తన్మయత్వంతో ప్రపంచాన్ని మరిచిపోయారనే విధంగా ఫోటో కనిపించింది.

మా ప్రైవేట్ ఫోటోలు లీక్ చేస్తారా?
అయితే జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో దిగిన ఫోటోలపై సుఖేష్ స్పందిస్తూ.. మా ప్రైవేట్ ఫోటోలు మీడియాలో లీక్ కావడం చాలా విచారకరం. గతవారం ఈ ఫోటోల వ్యవహారం నా దృష్టికి వచ్చింది. మా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడం మా ప్రైవసీకి భంగం కలిగించడమే. జాక్వలైన్‌కు ఇచ్చిన గిఫ్టులు, ఆమెతో రిలేషన్ ప్రేమకు మించిన విషయం అని సుఖేష్ అన్నారు.

జాక్వలైన్‌తో నాకు రిలేషన్‌షిప్
జాక్వలైన్ ఫెర్నాండేజ్‌లో నా రిలేషన్ గురించి ఇంతకు ముందే చెప్పాను. మా బంధం కేవలం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిది కాదు. మా బంధంపై దారుణంగా కామెంట్లు చేయడం తగదు. ఎలాంటి అంచనాలు, లాభాపేక్ష లేకుండా మా మధ్య స్పెషల్ బాండింగ్ ఉంది. ఒకరిపై మరొకరి మంచి గౌరవం ఉంది. దయచేసి ఆమెపై చెడుగా, దుష్ప్రచారం చేయకండి. నాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎలాంటి సంబంధం ఆమెకు లేదు అని సుఖేష్ తెలిపారు.

జాక్వలైన్ ఫెర్నాండేజ్ సినిమా కెరీర్
జాక్వలైన్ ఫెర్నాండేజ్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల సైఫ్, అర్జున్ కపూర్‌తో ఆమె నటించిన బూత్ పోలీస్ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం జాన్ అబ్రహంతో ఎటాక్ చిత్రంలో, సల్మాన్ ఖాన్‌తో కిక్2 చిత్రం, రణ్‌వీర్ సింగ్‌తో సర్కస్, అక్షయ్ కుమార్‌తో రామ్ సేతు, ఇంకా బచ్చన్ పాండే చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ లాంటి అగ్రహీరోలతో నటిస్తున్నారు.